మాతృదేవోభవ అన్న మాటని నిజం చేస్తూ తన తల్లి కణ్మనికి గుడి కట్టించి అందులో ఆమె పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నాడు డ్యాన్స్ మాస్టర్ గా కెరియర్ ప్రారంభించి దర్శకుడు నటుడుగా మారిన రాఘవేంద్ర లారెన్స్. తల్లికి గుడి కట్టాలనే ఆలోచన ఎప్పటినుండో ఉన్నా 2014 నుండి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాడు లారెన్స్. అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకునే ప్రయత్నంలో ఆమెకు గుడి కడుతున్నాడు లారెన్స్. 


రాజస్థాన్ లో తన తల్లి 5 అడుగుల విగ్రహాన్ని చేయిస్తున్న లారెన్స్ అది కాస్త ఆలస్యం అవడం వల్లే ప్రతిష్ట లేటయ్యిందని అంటున్నారు. ఇక తల్లితో పాటు 13 అడుగుల గాయత్రి దేవి విగ్రం కూడా ప్రతిష్ట చేయిస్తున్నారు లారెన్స్. ముందు గాయత్రి దేవి విగ్రహం ఆమె పాదాల దగ్గర తన తల్లి కణ్మని విగ్రహం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాడట. తల్లి మీద ప్రేమను ఈ విధంగా వ్యక్త పరచే తనయుడు ఎవరు లేరని చెప్పాలి.


కచ్చితంగా తల్లికి గుడి కట్టించడమే లారెన్స్ సంకల్పం చాలా గొప్పది. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తన తల్లికి లారెన్స్ ఇస్తున్న గొప్ప బహుమతి ఈ ఆలయం. తల్లి బ్రతికి ఉండగానే గుడి కట్టించి ఆమె పాదసేవ చేసుకుంటున్న లారెన్స్ నిజంగా మెచ్చుకోదగిన వాడు. రాబోతున్న తమిళ ఉగాది నాడు ఈ విగ్రహ ప్రతిష్ట ఉంటుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: