తెలుగు ఇండస్ట్రీలో ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ మంచి ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నాడు.  తర్వాత వచ్చిన సినిమాల్లో ‘రెడీ’ మంచి హిట్ అయ్యింది.  ఎప్పుడూ మంచి ఎనర్జీ, లవ్ స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుంటూ వస్తున్న రామ్ గత కొంత కాలంగా మంచి హిట్స్ లేకుండా పోయాయి.  ఆ మద్య వచ్చిన ‘నేనూ శైలజ’ మంచి విజయం సాధించిన తర్వాత రామ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.  
Image result for hero ram new looks
తాజాగా రామ్ కి ఓ వీరాభిమాని వార్నింగ్ ఇచ్చారట...ఆ..వార్నింగ్ అంటే అదేదో సిరియస్ గా కాదు త్వరగా కొత్త సినిమా అనౌన్స్ చేయకపోయావో .....జాగ్రత్త , నిరాహార దీక్ష చేస్తా '' అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడట.  దీంతో రామ్ కి దిమ్మతిరిగిందట..తర్వాత తేరుకొని నన్ను ఇబ్బంది పెట్టకు తమ్ముడూ అంటూ అతడికి రిప్లయ్ ఇచ్చాడు .
Image result for hero ram
హైపర్ సినిమా తర్వాత రామ్ కొత్త ప్రాజెక్ట్ ఏది సెట్స్ మీదకు వెళ్ళలేదు అంతేకాదు అదిగో సినిమా ఇదిగో సినిమా అంటూ రకరకాల దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఒక్కటి కూడా నెట్స్ పైకి వెళ్లలేదు.  దాంతో రామ్ వీరాభిమాని ఒకరు ఆలస్యానికి ఆగలేక పోయాడు అందుకే నిరాహార దీక్ష చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే రామ్ మాత్రం తన లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు బహుషా కొత్త సినిమా కోసం అయి ఉండవొచ్చని ఇండస్ట్రీల వర్గం అంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: