తెలుగు ఇండస్ట్రీలోకి నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాల ద్వారా పరిచయం అయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన ‘బేతాళుడు’ చిత్రం నిరాశపరిచినా ఇప్పుడు  'యమన్‌` మరోసారి హిట్ కొడతానంటున్నాడు.  విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌`.
Image result for vijay antony yaman movie
ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఓ యువకుడు రాజకీయాల్లోకి వచ్చి సంఘంలో జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదిరించడానేది చాలా అద్భుతంగా తెరకెక్కించారట.  విభిన్నమైన కథనాలతో వస్తున్న విజయ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయమంటున్నారు.
Image result for vijay antony yaman movie
విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: