తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఆలీ.  ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన ఆలీ ఇప్పుడు మరో అద్భుతమైన క్యారెక్టర్ తో అలరించబోతున్నాడట.   విచిత్ర‌మైన గెట‌ప్స్ తో కామెడి కి బ్రాండ్ అంబాస‌డ‌ర్ గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్డ్ గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తున్న ప్ర‌ముఖ కామెడి న‌టుడు ఆలీ "విన్న‌ర్" చిత్రంలో పీట‌ర్ హెయిన్స్ గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.
Image result for winner movie stills
సాధారణంగా పీట‌ర్ హెయిన్స్ పేరు విన‌గానే యాక్ష‌న్ గుర్తొస్తుంది..అయితే ‘విన్నర్’ చిత్రంలో ఈ పాత్రతో ఆలీ కడుపుబ్బా నవ్వించబోతున్నాడట.  ఆలీ పోషించిన పీట‌ర్ హెయిన్స్ పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ నుండి త‌న‌దైన శైలిలో న‌వ్వించారు. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని అల‌రించి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. దీనికి యాక్ష‌న్ తో పాటు వెన్నెల కిషోర్‌, 30 ఇయ‌ర్స్ పృథ్వి, ఆలీ లు విభిన్న‌మైన పాత్ర‌లు చేసి ఆద్యంతం న‌వ్వులు కురిపించారు.

Image result for winner movie stills

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న యు.స్ లో 100 ధియోట‌ర్స్‌లో  విడుదలకానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: