ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే ఒక్క కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, చిన్నలు అంతా ఇక్కడ గొడవ పెట్టుకుంటే చాలు…పంతాలకు పోయోంతలా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రూపు గొడవలు ఎక్కువుగా ఉంటున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయనేది అక్కడి వాతావరణంని చూస్తే తెలుస్తుంది.


వీటికి సంబంధించిన వివరాలను చూస్తే…హీరో విశాల్ కు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు మధ్య ఎడతెగని వార్ జరుగుతూనే ఉంది. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న వివాదానికి హైకోర్ట్ తీర్పుతో చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో విశాల్ వివిధ స్థాయి పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ దక్షిణభారత నటీనటుల సంఘం మాత్రం విశాల్ కు అలా వివిధ పదవుల్లో పోటీ చేసే అర్హత లేదని తేల్పిచెప్పింది.


మద్రాస్ హై కోర్టులో నుండి విశాల్ తీర్పుని గెలిచి తను అనుకున్నది సాధించుకున్నాడు. హైకోర్టు విశాల్ ను వివిధ పదవులకు పోటీ చెయ్యొచ్చని తీర్పు చెప్పటంతో ఇప్పుడు విశాల్ వర్గం తొడ కొట్టేంత పని చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సగానికి పైగా పెద్దలకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడనే న్యూస్ బయటకు వస్తుంది. తనని అనవసరంగా లీగల్ గా ఇరికించాలని చూస్తే ఇక సహించేది లేదని స్పష్టంగా చెప్పుకొచ్చారు.


ఇప్పటి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 60 శాతంకి పైగా పెద్ద వాళ్ళు విశాల్ అంటే అస్సలు పడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ విధమైన వార్నింగ్ ఇవ్వటం అనేది…ఇది ఎంత వరకూ దారితీస్తుందో అని అంటున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ అయిన శరత్ కుమార్ వంటి వాళ్ళు విశాల్ ని ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా తిట్టడం సహజంగా చూశాము. ఇకనుండి విశాల్ దూకుడిని శరత్ కుమార్ ఏ విధంగా అడ్డుకుంటాడు అనేది ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: