పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కాటమరాయుడు.  ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్రయూనిట్ స్టార్ట్ చేసింది. సమయం దొరికినప్పుడు కాటమరాయుడు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు.


ఇదిలా ఉంటే కాటమరాయుడు మూవీపై ప్రస్తుతం ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ తమిళ రిమేక్ చిత్రంగా వస్తుంది కాబట్టి….ప్రేమ్ టు ప్రేమ్ తమిళ నేటివిటిలాగే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. తమిళంలో వచ్చిన వీరమ్ మూవీకి ఇది రిమేక్ గా వస్తుంది. అయితే వీరమ్ మూవీ తమిళ ప్రేక్షకులకి బాగుంటుంది కానీ…తెలుగు ప్రేక్షకులకి అంతగా సెట్ అయ్యేది కాదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.


దీంతో టాలీవుడ్ లో కొంత నెగిటివ్ టాక్స్ రావటంతో ఈ మూవీపై చిత్ర యూనిట్ పాజిటివ్ టాక్స్ ని చేసే ప్రయత్నం చేస్తుంది. వీటికి సంబంధించి వివరాల్లోకి వెళితే….పవన్ కళ్యాణ్‘కాటమరాయుడు’లో స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ విజయంగా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోనూ శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది. దీంతో ‘కాటమరాయడు’ చిత్రం సైతం పెద్ద విజయం సాదిస్తుందనే నమ్మకం చిత్రయూనిట్ లో బలంగా ఉంది. అలాగే ఈ బ్యూటీ కాటమరాయుడు మూవీ సైతం విజయం సాధిస్తుందని చెప్పటానికి పలు కారణాలను చెప్పుకొచ్చింది.


ముఖ్యంగా వీరమ్ మూవీకి కాటమరాయుడికి ఏంతో తేడా ఉంటుందని చెప్పుకొచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో పలు భారీ మార్పులు చేశారని చెప్పుకొచ్చింది. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కాటమరాయుడు ఉందని చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. అయితే శ్రుతిహాసన్ తో ఈ విధంగా కామెంట్ చేయించటంలో వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ప్రమోషన్ స్ట్రాటజీ బాగా తెలుసుకాబట్టి ఈ విధమైన ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. కిశోర్ కుమార్ అలియాజ్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: