తెలుగు సినిమా రంగంలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు క్రేజ్ ప్రస్తుత తరం నటుల హవా ముందు మసక బారిపోయినా శరత్ బాబు విలక్షణ నటుడుగా  కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగం పై తనదైన ముద్ర వేసుకున్న నటుడు. నటుడిగా ఇతడికి ఎంత పేరు ఉందొ ఇతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని వివాదాలు ఉన్నాయి.  

మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వార్తల్లోకి  ఎక్కిన శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను ఆ తరువాత  స్నేహ లతా దీక్షిత్ లను పెళ్లాడాడు.  అయితే ఈ ఇద్దరితోనూ శరత్ బాబు విడిపోయాడు.  అయితే ఆ తర్వాత శరత్ బాబు మూడో వివాహం కూడ చేసుకున్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియకపోయినా ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాన్ని బయట పెట్టాడు శరత్ బాబు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురు కాగా భార్య పేరు చెప్పేందుకు నిరాకరించాడు ఈ విలక్షణ నటుడు.  అంతేకాదు తన  భార్యపేరు మిస్సెస్‌ శరత్‌బాబు అని మాత్రమే  చెప్పి మరో షాక్ ఇచ్చాడు. 

ఇదే సందర్భంలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు పాతిక మంది పిల్లలు అని చెప్పి ఆ ఇంటర్వ్యూ  చేస్తున్న వ్యక్తికి షాక్ ఇచ్చాడు.  తన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు అందరూ కూడా తన  పిల్లలే అని అంటూ వారి సంఖ్యా 25 వరకు ఉంటుంది అన్న విషయాన్ని బయట పెట్టాడు. ఇదే సందర్భంలో తన గత రెండు వివాహాల గురించి ఎదురైన ప్రశ్నకు  స్పందిస్తూ వారి పేరు కూడా ఉచ్చరించడం  తనకు  ఇష్టం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు.  

జీవితం ఒక ప్రయాణం జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల్లో పెళ్ళి కూడా ఒక సంఘటనే అని అంటూ కొన్ని జీవితకాలం ఉంటాయి. మరికొన్ని కాలం తీరిపోయిన కాలగర్భంలో కలిసిపోతాయి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు శరత్ బాబు.  జీవితంలో ఏం జరిగినా మంచికే  జరుగుతుంది అని చెపుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. 

అయితే ఈమధ్య రమాప్రభ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో మాట్లాడుతూ శరత్ బాబు మీద సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న తామిద్దరం కలిసి 16 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత విబేధాలతో విడిపోయిన్నప్పుడు ప్లాన్డ్ గా తన ఆస్తి అంతా రాయించుకుని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమా ప్రభ ఆరోపించింది.  ఇలా ఎన్నో బయటపడని చేదు నిజాలు శరత్ బాబు జీవితంలో ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: