తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.   ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాత వచ్చిన దేశముదురు, బన్ని,ఆర్య చిత్రాలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి,సరైనోడు లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలతో దుమ్ములేపుతున్నాడు.  తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటిస్తున్నాడు బన్నీ. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్  టీజర్ రిలీజ్ చేసారు .  
DJ Duvvada Jagannadham Movie Latest Stills
అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడి గా నటిస్తున్న ఈ చిత్రంలో అదిరి పోయే ట్విస్ట్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది . 40 సెకండ్ల కి పైగా ఉన్న ఈ టీజర్ లో క్లాస్ తో పాటు అంతర్లీనంగా మాస్ ని మెప్పించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పకనే చెబుతోంది.  ఈ చిత్రంలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే చాలా సెక్సీగా కనిపిస్తుంది. అంతే కాదు అల్లు అర్జున్ ని ముద్దులతో ముంచెత్తే సీన్ల తో బాగా ఆకట్టుకుంటుంది.  
DJ Duvvada Jagannadham Movie Latest Stills
స్విమ్ సూట్ తో రెచ్చగొడుతూ మొత్తానికి పూజా హెగ్డే  ఈ చిత్రంలో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగానే పెంచినట్లుంది.  ఈ చిత్రంలో బన్ని ద్విపాత్రాభినయం చేస్తున్నాడట..అయితే ఈ రోజు రిలీజ్ అయిన పాత్ర అందులో ఒకటి అయి ఉంటుందని అనుకుంటున్నారు.  అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడి గా నటిస్తున్నప్పటికీ అతడిలో మరో కోణం ఉండేలా స్పష్టం అవుతోంది.

DJ Duvvada Jagannadham Movie Latest Stills



మరింత సమాచారం తెలుసుకోండి: