తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముద్దులు మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ఒకరు.  ‘రేయ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..అది కాస్త వాయిదా పడటంతో ‘పిల్లా నువ్వులేని జీవితం’ రీలీజ్ అయ్యింది.  ఈ చిత్రం మంచి విజయం సాధించడం..తర్వాత వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో మనోడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  ఇక సుప్రీమ్ చిత్రం హిట్ కావడంతో సాయిధరం తేజపై నిర్మాతల దృష్టి పడింది.  
Related image
ఈ రోజు సాయిధరమ్ తేజ నటించిన ‘విన్నర్’ చిత్రం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ చిత్రంలో మనోడు జాకిగా నటించడం..అందాల భామ రకూల్ ప్రీత్ సింగ్  లక్ష్యం కోసం పోరాటడం చాలా బాగుంది.  అంతే కాదు విలన్ గా అనూప్ కూడా చాలా అద్భుతంగా చేశాడు.  తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.  ఇక సినిమాలో పుష్కలంగా హాస్యం ఉండటం..ఆలీ ఈ సారి ‘పీటర్ హెయిన్ ’ బాగా ఆకట్టుకున్నాడు.  ఇక సినిమాలో ఫైట్స్ కూడా చాలా వెరైటీగా తీయడం మరో విశేషం.  ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సింగం పాత్రతో ఫృథ్వి కూడా తెగ నవ్వించాడు. 
Image result for winnar movie anasuya
హార్స్ రైడింగ్ తో సాయిధరమ్ తేజ బాగా ఆకట్టుకున్నాడు.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన హార్స్ రైడింగ్ గుర్తుకు వస్తుంది.  అంతే కాదు ఈ సినిమాలో కూడా తన మామయ్య చిరంజీవి, పవన్ కళ్యాన్ లను అనుకరిస్తూ కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.  స్టోరీ పరంగా చూస్తూ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నా..టేకింగ్ కొత్తగా అనిపించింది.  ఈ సినిమాపై అభిమానులు ఎలా స్పందిస్తారో...రిజల్ట్ ఎలా ఉంటుందో రేపటి వరకు ఫస్ట్ డే కలెక్షన్లు ఏ మేరకు వస్తాయో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: