సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన మూవీ విన్నర్. నేడు ఈ మూవీ ప్రంపచ వ్యాప్తంగా థియోటర్స్ ని హిట్ చేసింది. అయితే ఒక్కరోజు ముందుగానే యుఎస్ నుండి విన్నర్ మూవీ టాక్ బయటకు వచ్చింది. సినిమా బాగుందంటూ వచ్చిన ఈ టాక్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ప్రభావితం చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. అప్పటి వరకూ బెన్ఫిట్స్ షోలని ఎక్కువుగా ప్లాన్ చేసుకోని థియోటర్స్ లు…రాత్రికి రాత్రే బెన్ఫిట్స్ షోలను ప్లాన్ చేశాయి.

దీనికారణంగా ఉదయాన్నే థియోటర్స్ వద్ద మెగాఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇదిలా ఉంటే విన్నర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనే దానిపై వివరాలను చూస్తే….విన్నర్ మూవీకి ఇప్పటి వరకూ 80 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే చూసింది. ప్రధాన నగరాలతో పాటు ఇతర ఏరియాల్లో ఈ మూవీకి 100 శాతం ఆక్యుపెన్సీ అస్సలు కనిపించలేదు. మల్టీప్లెక్స్ ల్లోనూ యావరేజ్ గా చూసుకుంటే ఇది 90శాతం ఆక్యుపెన్సీనే చూపించింది.

ఇక జిల్లాల్లో ఇది 80 శాతంగానే ఉంది. దీంతో కలెక్షన్స్ కొంత డ్రాప్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ట్రేడ్ పండిట్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం విన్నర్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 3 నుండి 4.5 కోట్ల రూపాయల వరకూ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విన్నర్ మూవీకి డివైడ్ టాక్ బయటకు రావటంతో ఇది ప్రేక్షకుల్లో కొంత గంధరగోళానికి దారితీసింది.

అయితే రెండో షో ప్రదర్శన జరుపుకునే సమయానికి విన్నర్ మూవీపై పాజిటివ్ టాక్స్ స్టార్ట్ అయ్యాయి. సాయంత్రం, నైట్ షోలకి అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అయితే ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటి వరకూ సాయి ధరమ్ తేజ్ నటించిన అన్ని చిత్రాల కంటే విన్నర్ మూవీకే అత్యధికంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా విన్నర్ మూవీ మొదటి రోజుకలెక్షన్స్ దాదాపు 4.5 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: