పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మెగా రికార్డ్స్ ని అన్నింటికి చెరిపేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో ఇండస్ట్రీని ఓ ఊపు  ఊపాడు. అంతే కాకుండా ఇప్పుడు ఖైదీ నెం 150 వ చిత్రం ఓ రేంజ్ లో  రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కొన్ని రికార్డ్స్ కొంత కాలం పదిలంగా ఉంటాయనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ ఎక్కడా కనిపించటం లేదు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…చిరంజీవి రికార్డ్స్ ని బీట్ చేశాడని అంటున్నారు. ఖైదీ నెం 150 మూవీకి సంబంధించిన ప్రతీ రికార్డ్ ని పవన్ కళ్యాణ్ చెరిపివేయటం ఇక్కడ ప్రత్యేకంగా మారింది. యూట్యూబ్ లో ‘ఖైదీ నెం 150’ టీజర్ కు రికార్డు స్థాయిలో 7.41 మిలియన్ల మంది చూశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ టీజర్ ను 7.74 మిలియన్ల మంది చూశారు. దీంతో ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నీ చెదిరిపోయినట్టే అని చెప్పవచ్చు.


మెగాస్టార్ కంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే విషయం దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఇక కాటమరాయుడు తరువాత స్థానంలో ఉన్న సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీలను చూస్తే….‘ఖైదీ నెం. 150’ కి రెండవ స్థానం,మూడవ స్థానంలో రజనీకాంత్ ‘కబాలి’ నిలిచింది. మొత్తంగా యూ ట్యూబ్ లో మెగా హీరోలు సాధించుకున్న రికార్డ్స్ అన్నింటిని కాటమరాయుడు మూవీ వచ్చి చెదరగొట్టడంతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి అర్ధం అయింది.


కాటమరాయుడు మూవీకి ఫ్యాన్స్  మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉందనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కాటమరాయుడు’ చిత్రం మార్చి నెలాఖరున రిలీజ్ కానుంది. ఇక కాటమరాయుడు మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: