టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలోనే నేషనల్ స్టాండర్డ్స్ ని అందుకుంటుందని అందరూ తెగ మురిసిపోతున్నారు. ఓ బాహుబలి, ఘాజీ వంటి చిత్రాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాని చాటుతున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటే పెద్ద హీరోలు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. ఇదంతా స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోలు, నిర్మాతలు పడిన కష్టానికి ప్రతిఫలం.

అందుకే తెలుగు సినిమాలపై నేషనల్ మార్కెట్ లో ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడుతుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’ మూవీ థియోట్రికల్ ట్రైలర్ అందర్నీ ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. బాలీవుడ్ మసాలా చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా ఓ అడుగు ముందుకు వేసి మరీ పరాకాష్టను చూపించారు.

లాభనష్టాలతో పనిలేకుండా దర్శకుడు ఏం అనుకున్నాడో…దాన్నే చిత్రీకరించి యూత్ కి ఆకర్షణీయమైన స్పైసీ చిత్రాన్ని రెడీ చేశారు. ఇక విడుదలైన‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’ ట్రైలర్ యూత్‌ను రెచ్చగొట్టేవిధంగా ఉంది. ట్రైలర్ అంతా అడ్డల్ట్‌ గా ఉంది. ఇదో అడల్ట్ చిత్రం అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పవచ్చు. మరీ దిగజారిన బూతుతో ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’ మూవీ ట్రైలర్ ఉందని అంటున్నారు. రొమాంటిక్‌ పిక్చర్స్‌ తో కూడిన స్టిల్స్‌ రిలీజ్‌ అయ్యాక అందరూ ఈ మూవీపై ప్రత్యేకమై ఆసక్తిని చూపించారు.

ఈ సినిమా థియోటర్స్ లోకి రిలీజ్ అయితే ఇందులో యూత్ నేర్చుకునేది ప్రత్యేకంగా ఏమిలేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావచ్చనే టాక్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రిలీజ్ నాటికి ఈ మూవీపై ఎటువంటి గొడవలు లేకపోతే కూల్ గా రిలీజ్ అవుతుంది. ఒకవేళ గొడవలు జరిగితే మాత్రం రిలీజ్ కి నోచుకునే పరిస్థితి కనిపించదు. ఇంతటి దారుణమైన ట్రైలర్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మేకర్స్ కి సైతం సాధ్యం కాదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. మొత్తంగా ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’ మూవీ ఇప్పుడు యూత్ లో హాట్ టాక్స్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: