తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి.  తెలుగు సినీ చరిత్రకు కొత్త రికార్డులను పరిచయం చేసి కొత్త దిశను చూపిన చిత్రం బాహుబలి. అందులో ఎలాంటి సందేహం లేదనేది సినీ అభిమానులు, విశ్లేషకుల మాట. తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు సినిమా జక్కన్న రాజమౌళి.
Related image
బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు.  అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా కైవసం చేసుకుంది.  ప్రస్తుతం బాహబలి 2 చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది.  కాగా ఇప్పటికే బాహుబలి 2 చిత్రానికి సంబంధించి కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు జక్కన్న. ఈ రోజు శివరాత్రి కానుకగా బాహుబలి టీం ప్రత్యేకంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.
Image result for బాహుబలి 2
ఆ ప్రత్యేక పోస్టర్ ను అభిమానులతో పంచుకుంటూ.. సాహోరే బాహుబలి.. మహాశివరాత్రి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు రాజమౌళి. ప్రభాస్ తో సహా రానా, అనుష్క, తమన్నా ఈ సినిమాలో కీల పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: