అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడంతో షాక్ లోకి వెళ్ళిన అక్కినేని కాంపౌండ్ ఆలోచనలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అఖిల్ పెళ్ళి క్యాన్సిల్ విషయమై వస్తున్న రకరకాల వార్తలకు సమాధానంగా ఒక అధికారిక ప్రకటన కూడ చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా మొదట్లో అఖిల్ పెళ్లి అయిన తరువాత తాను పెళ్లి చేసుకుంటానని గతంలో అనేకసార్లు చెప్పిన నాగచైతన్య తన నిర్ణయం మార్చుకుని ఈ పరిణామాల నేపథ్యంలో సమంతతో తన పెళ్లిని అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే జరిపేందుకు అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి. లెక్క ప్రకారం అఖిల్ పెళ్లి మే నెలలో అనుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య సమంత పెళ్లి చేద్దామని నాగార్జున అనుకున్నారు. 

కానీ ఇప్పుడు అఖిల్ కోసం అనుకున్న ముహుర్తానికే నాగచైతన్య-సమంతల వివాహం జరిపించాలని నాగ్ భావిస్తున్నాడట. దీనికోసం కొంతమంది పండితులతో నాగ్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆగష్టు లేదా సెప్టెంబర్ లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నాగచైతన్య, సమంత ఇద్దరు వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు. 

కాని నాగార్జున ఒత్తిడి మేరకు కాస్త ముందుగానే పెళ్లికి సిద్ధమవ్వాలని చైతూ సమంతలు ఒప్పుకున్నట్లు టాక్. ప్రస్తుతం చైతూ, సమంతలు ఇద్దరూ చెరో రెండేసి సినిమాలకు కాల్షీట్లు కేటాయించిన నేపధ్యంలో మారిన ఈ మ్యారేజ్ ప్లాన్ వల్ల సమంత చైతూల లేటెస్ట్ సినిమాల షూటింగ్ డేట్స్ లో కూడ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా అఖిల్ పెళ్లి వ్యవహారం రద్దు అక్కినేని కాంపౌండ్ లో ఎన్నో కొత్తలోచనలకు తావిచ్చింది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: