తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శేఖర్ బాబు శనివారం కన్నుమూశారు.  గత కొంత కాంలగా ఆయన తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నారు.  రెండేళ్ల కిందట శేఖర్‌బాబు గుండెకు ఆపరేషన్  జరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించారు.

తెలుగులో మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠా మేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం చిత్రాలను శేఖర్‌ బాబు నిర్మించారు.

శేఖర్ బాబు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్‌లో పని చేశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీ వుంటున్న శేఖర్ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.  శేఖర్‌‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: