న్న విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్’ టీజర్ అదిరిపోయింది అంటూ అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకుంటే నిన్న విడుదలైన ఈ టీజర్ అల్లు అర్జున్ కు పూర్తిగా సంతృప్తి కలిగించలేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం బన్నీ గతంలో హరీష్ శంకర్ డిజైన్ చేసిన ‘గబ్బర్ సింగ్’ టీజర్ లా అధిరిపోతు తన జగన్నాథం టీజర్ ఉండాలని పదేపదే హరీష్ శంకర్ కు బన్నీ చెప్పాడని టాక్. 

అయితే నిన్న విడుదలైన డీజె ట్రైలర్ ‘గబ్బర్ సింగ్’ స్థాయిని అటు ఉంచి కనీసం తన ‘సరైనోడు’ టీజర్ తరహాలో దుమ్ముదులిపే స్థాయిలో లేదు అన్న అభిప్రాయం బన్నీ మనసులో ఉన్నట్లు టాక్. అయితే ఇంత సింపుల్ గా ఈ టీజర్ ను విడుదల చేయడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. 

ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన రెండు మూడు టీజర్లను హరీష్ శంకర్ చేత కట్ చేయించి విసిగిపోయిన అల్లు అర్జున్ ఈమూవీ పై ఎటువంటి భారీ అంచనాలు పెరిగి పోకుండా ఒక బిజినెస్ స్ర్టాటజీతోనే ఇలా సింపుల్ గా ఇలాంటి టీజర్ ను విడుదల చేసారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే బన్నీ అభిమానులు మాత్రం ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపడేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా బన్నీ ఈ టీజర్ లో బ్రహ్మణుడి గెటప్ లో రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. నుదుట నామాలు చేతిలో రుద్రాక్ష దండ పొద్దున్నే నియమంగా హారతులు ఇవన్నీ చూస్తూ ఉంటే హరీష్ శంకర్ బన్నీని స్వచ్ఛమైన బ్రాహ్మణుడిలా చూపించడానికి చాల పెద్ద హోమ్ వర్క్ చేసినట్లే కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: