తెలుగు ఇండస్ట్రీలో మొదట విలన్ గా వచ్చి తర్వాత హీరోలు అయిన వారు చాలా మంది ఉన్నారు.  ఇక ఇండస్ట్రీలో విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన టి కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ మొదటి సినిమా పెద్దగా విజయం కాలేదు. తర్వాత వచ్చి జయం చిత్రం అద్భుత విజయం సాధించింది..ఈ చిత్రంలో గోపి చంద్ విలన్ గా వేసినా హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది. మహేష్ బాబు నటించిన ‘నిజం’, ప్రభాస్ నటించిన ‘వర్షం’ చిత్రంలో ప్రతినాయకుడిగా మెప్పించిన గోపిచంద్ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.
Image result for gopichand
 తాజాగా   గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభించింది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ గెటప్ అందరినీ అలరించింది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మరో స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేశారు.    
Image result for gopichand goutam nanda
ఈ సందర్భంగా నిర్మాత జె.భగవాన్ -జే.పుల్లారావ్ మాట్లాడుతూ..ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని గోపీచంద్ క్యారెక్టర్ ను, స్టైలింగ్ ను సరికొత్తగా ఎలివేట్ చేశాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నాం. ఫైట్ సీన్స్ కోసం గోపీచంద్ నాలుగు రోజులపాటు రిహార్సల్ చేయడంతో.. మూడు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయగలిగాం. తెలుగులో ఈ విధంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయడం అనేది ఇదే ప్రప్రధమం.
Image result for gopichand goutam nanda
ఒక హీరోగా గోపీచంద్ కమిట్ మెంట్ కు నిదర్శనం ఇది. మార్చిలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నాం" అన్నారు. హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది


మరింత సమాచారం తెలుసుకోండి: