మెగాస్టార్ చిరజీవి తన 150వ సినిమాగా ఖైది నంబర్ 150 చేసే క్రమంలో అంతకుందు చాలామంది దర్శకుల దగ్గర కథలు వినటం అవి నచ్చక కాదని చెప్పడం జరిగింది. ఇక వారిలో పూరి కూడా ఉన్నాడు.. పూరి జగన్నాథ్ చిరు కోసం ఆటోజాని కథ రాసుకున్నాడు. కథ మొత్తం విన్న చిరంజీవి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అని సెకండ్ హాఫ్ మార్చుకు రమ్మని చెప్పాడని తెలిసిందే. ఇక ఆ తర్వాత రిస్క్ ఎందుకని కత్తి రీమేక్ నే ఖైది నంబర్ 150గా తీసుకు రావడం దానితో సూపర్ హిట్ కొట్టడం జరిగింది.


పూరి కథ సగం మాత్రమే నచ్చినా మిగతా సగం రాసేంత టైం లేక చిరు ఆ సినిమా కాదనేశాడు. అయితే ప్రస్తుతం పూరి టైం కూడా అంత బాగా ఏం నడవట్లేదు. ఇజం ఫ్లాప్ తో పూరి మరి వెనక్కి వెళ్లాడు. ఇలాంటి టైంలో కూడా పూరి చెప్పిన కథకు ఇంప్రెస్ అవడంతో బాలయ్య సినిమా కన్ఫాం చేశాడు. 100వ సినిమా శాతకర్ణిగా సంచలన విజయం అందుకున్న బాలకృష్ణ 101వ సినిమాగా పూరితో చేస్తున్నాడట.


పూరి ఎంపికపై బాలయ గట్స్ కు మెచ్చుకుంటున్నా ఇదో రకంగా మెగాస్టార్ కు పెద్ద పంచ్ పడ్డట్టే అని తెలుస్తుంది. ఇండస్ట్రీ రికార్డులను సైతం ఇచ్చిన పూరి డైరక్షన్ లో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా కాస్త ఆలోచిస్తున్నారు. అందుకే బాలయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకుని సూపర్ హిట్ కొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు పూరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: