సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పడుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు సినిమా టటిల్ కన్ఫాం చేయలేదు. అయితే ప్రస్తుతం సంభవామి టైటిల్ ప్రచారంలో ఉండగా ఆ టైటిల్ తో మహేష్ అంతగా కంఫర్ గా ఫీల్ అవ్వట్లేదని తెలుస్తుంది. 


ఫ్యాన్స్ లో కూడా ఆ టైటిల్ పై కాస్త విమర్శలు రావడంతో మళ్లీ మహేష్ మూవీ టైటిల్ కన్ ఫ్యూజన్ మొదలైంది. అందుకే ఈసారి టైటిల్ పెట్టే డెశిషన్ ను ఫ్యాన్స్ కే అప్పచెప్పే ఆలోచనలో ఉన్నాడట మహేష్. అనుకున్న మూడో నాలుగో టైటిల్స్ ఫ్యాన్స్ ముందు పెట్టి వాటిలో బెస్ట్ వన్ సెలెక్ట్ చేయమని పోల్ ఏర్పాటు చేస్తారట. ఎక్కువమంది ఏ టైటిల్ అయితే ఓకే అంటారో దాన్ని సినిమా టైటిల్ గా పెట్టాలని అనుకుంటున్నారు.


మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: