లవర్ బోయ్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న నితిన్ ఇష్క్ కు ఐదేళ్లు నిండాయి.. అదేంటి నితిన్ ఎవరితోనూ ప్రేమలో లేడుగా మరి అతని ఇష్క్ అదేనండి ప్రేమ ఎలా ఐదేళ్లు పూర్తి చేసుకుంది అంటే. ఇక్కడ విషయం ఏంటంటే నితిన్ నటించిన ఇష్క్ సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు అవుతుంది. నితిన్ కెరియర్ లో ఆ సినిమా ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. 


2004 నుండి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కు విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఇష్క్ సినిమా టర్నింగ్ పాయింట్. ఆ సినిమా నుండి మళ్లీ హిట్ మేనియా కొనసాగించాడు నితిన్. రీసెంట్ గా త్రివిక్రం డైరక్షన్ లో అఆ సినిమాతో ఏకంగా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు నితిన్. ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్న నితిన్ ఇష్క్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ సినిమా డైరక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్స్ కు థాంక్స్ చెప్పాడు. 


ఒక హిట్టు రెండు ఫ్లాపులతో కొనసాగుతున్న నితిన్ కెరియర్ అ ఆ సక్సెస్ తో మళ్లీ గాడిలో పడ్డట్టే అని చెప్పొచ్చు. హను సినిమాతో పాటుగా కొత్త దర్శకుడు చైతన్య కృష్ణ డైరక్షన్ లో కూడా సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాను త్రివిక్రం పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండటం విశేషం. మరి ఇష్క్ లాంటి సక్సెస్ లతో నితిన్ కెరియర్ అంతా సక్సెస్ ఫుల్ గా ఉండాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: