మెగా హీరోల్లో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రీసెంట్ గా విన్నర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా టీజర్ ట్రైలర్స్ తో ఏదో విషయం ఉంది అని చూపించి చివరకు సినిమా చూస్తే రొటీన్ డబ్బా కొట్టుడుతో కానిచ్చేశాడు. తేజ్ ఇమేజ్ కు కమర్షియల్ ఎంటర్టైనర్ ఉంటే చాలు అనుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని దానికి తగ్గ కథ ఉండాలి అన్న విషయం మర్చినట్టున్నాడు.


సినిమా మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ సుప్రీం హిట్ తో జోష్ లో ఉన్న తేజ్ కు తిక్క మూవీ ఫ్లాప్ అయ్యింది. అయితే తిక్క కన్నా విన్నర్ బెటర్ అనేలా ఉన్నా రొటీన్ కథ కథనాలతో ఆడియెన్స్ ను మరోసారి ఫూల్స్ ను చేయాలని చూశారు చిత్రయూనిట్. ఓ పక్క కొత్త ఐడియాలతో సినిమాలు చేస్తుంటే తేజ్ మాత్రం కథల విషయంలో జాగ్రత్తలు పడటకపోవడం విచిత్రంగా ఉంది.


అసలు ఇదవరకే ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా అన్న లాజిక్ తేజ్ ఎలా మిస్ అయ్యాడని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ సినిమాకు ఆకర్షణగా ఉన్నా సినిమాలో తేజ్ యాక్షన్ తప్పించి విషయం ఏమి లేదని తేల్చేశారు. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు అంతగా హెల్ప్ అవలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: