వెండితెర డార్లింగ్ ప్రభాస్ మనస్తత్వం పై బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించిన ‘రంగూన్’ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

తాను ప్రభాస్ తో 2009లో ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ ను తాను మొట్టమొదటిసారి సెట్స్ లో చూసినప్పుడు ఒక ప్లే బాయ్ గా నవ్వుతూ నవ్విస్తూ కనిపించిన ప్రభాస్ ను చూసినప్పుడు తనకు అతడు ఒక మంచి గొప్పనటుడు అవుతాడు అని అనిపించలేదని అంటూ కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ తరువాత ప్రభాస్ తో తనకు కాంటాక్ట్ కూడ పూర్తిగా కట్ అయిపోయిన తరువాత ఊహించని రీతిలో ప్రభాస్ విశ్వరూపాన్ని ‘బాహుబలి’ లో చూసినప్పుడు తాను ఆశ్చర్యపడటమే కాకుండా ప్రభాస్ ఇంత గొప్ప నటుడా అని తనకు అనిపించిన విషయాన్ని లీక్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
  
ఇదే సందర్భంలో కంగన శృంగారం గురించి, తన శీలం గురించి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాను శీలవతిని కానని తన తల్లిదండ్రులు చాలాసార్లు అనుమానిస్తూ ఉంటారని ఓపెన్‌గా చెప్పేసింది కంగన. తన శీలం గురించి తన తల్లి తండ్రులు ఏమని అనుకుంటున్నారు అనే ప్రశ్నపై ఆమె ఓపెన్‌గా ఇలా చెప్పెయ్యడంతో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నవారి మైండ్ బ్లాంక్ అయింది. 

'అందరి తల్లిదండ్రుల్లాగానే నా తల్లిదండ్రులూ నేను పెళ్లి అయ్యేంతవరకు శీలవతిలా ఉండాలని కోరుకుంటారు. కానీ, నా గత ఎఫైర్ల గురించి వాళ్లకు చెప్పేటప్పుడు.. వాళ్లలో కళ్లలో ఫీలింగ్‌ గమనిస్తే.. నేను శీలవతినని వారు అనుకోవట్లేదనే విషయం అర్థమవుతుంది. నా శీలం మీద వారికి అనుమానం ఉన్న విషయం నిజమే. అయితే ఆ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పరు' అంటూ సినిమా రంగం గురించి అలాగే బాలీవుడ్ టాప్ హీరోల గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసిన కంగన ఇంటర్వ్యూ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: