మెగా మేనళ్లుడిగా సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ వచ్చి సుప్రీం హీరోగా అవతరించిన సాయి ధరం తేజ్ రీసెంట్ గా విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథ కథనాలతో వచ్చి ఇక్కడే యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఓవర్సీస్ లో అయితే విన్నర్ కాస్త లూజర్ అయ్యాడని అంటున్నారు. మెగా మేనియాతో రచ్చ చేస్తున్న తేజ్ విన్నర్ గా కొత్త స్టైల్ తో కనిపించాడని కోటిన్నరకు పైగా ఈ సినిమా కొన్నారట.


ప్రీమియర్ షో.. ఫస్ట్ రోజు వసూళ్లు చూస్తే సినిమా అక్కడ కష్టమే అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే శివరాత్రి వచ్చింది కాబట్టి మొదటి రోజు 5 కోట్ల పైన షేర్ రాబట్టగలిగారు. వీకెండ్ తో కలిపి ఇక్కడ పర్వాలేదు కాని ఓవర్సీస్ లో మాత్రం సినిమా నష్టాలు తీసుకురావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. హార్స్ రైడ్ నేపథ్యంతో తండ్రి సెంటిమెంట్ కూడా పొందుపరచిన ఈ కథతో మ్యాజిక్ చేయలేక రొటీన్ గా నడిపించాడు గోపిచంద్ మలినేని.


కలక్షన్స్ ఎలా ఉన్నా సినిమాలో మెగా పవర్ చూపించాడు సాయి ధరం తేజ్.. ఓ విధంగా తేజ్ కు ఓ కొత్త మేకోవర్ గా ఉంది విన్నర్ మూవీ.. సినిమా పరంగా కమర్షియల్ హంగులతో తన ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. కాని ఫలితమే అనుకున్న విధంగా రాలేదు. తేజ్ ఫైట్స్ రకుల్ అందాల కోసమే మెగా ఫ్యాన్స్ సినిమా చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: