సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం రోబో2. గతంలో బాహుబలి మూవీ మాత్రమే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని రోబో2 తిరగరాస్తుంది. ఒక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రోబో2 చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కునుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోబో2 మూవీకి సంబంధించిన కొన్ని హైలెట్స్ బయటకు వచ్చాయి.


కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చాయి. వీటి వివరాలను ఇప్పుడు చూస్తే…సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘రోబో 2’ చిత్రం ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో 2010 లో వచ్చిన ‘రోబో’ కు ఈ చిత్రం సీక్వెల్ గా వస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ వివరాలు ఇప్పుడు పక్కా సమాచారంతో బయటకు వచ్చాయి.


ఈ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇండియాలో ఏ మూవీ ఇప్పటి వరకూ ఇంత బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకోలేదు. అలాగే హీరోయిన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని పూర్తి న్యూడ్ గా చిత్రీకరించారనే న్యూస్ బయటకు వచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి…హీరోయిన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు న్యూడ్ గా చిత్రీకరించాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.


అయితే ఈ సీన్స్ కి ఇండియాలో సెన్సార్ ఉంటుందట. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆ సీన్స్ ను ఎటువంటి కత్తెర లేకుండా ప్రదర్శిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. హీరోయిన్ అమీ జాక్సన్ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్..హీరోయిన్స్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రోబో2 ఫైట్స్ ను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బ్యాట్స్ రూపొందించనున్నారు. ఇక రోబో2 చిత్ర టీజర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: