నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాని చేసే సినిమాల దర్శకులు కేవలం కొత్తవారో లేక ఒక్కటి రెండు సినిమాల అనుభవం ఉన్నావారో కావడం విశేషం. ఎవడే సుబ్రమణ్యం దగ్గర నుండి రీసెంట్ సూపర్ హిట్ నేను లోకల్ దాకా నాని తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. భలే భలే మగాడివోయ్ తర్వాత నాని తన కెరియర్ లో నేను లోకల్ తో హయ్యెస్ట్ గా 30 కోట్ల కలక్షన్స్ సాధించాడు.


నాని ప్రస్తుతం శివ డైరక్షన్ లో నిన్ను కోరి సినిమా చేస్తున్నాడు. ఇతను కూడా కొత్త దర్శకుడు కావడం విశేషం. కేవలం తనకు హిట్ ఇచ్చే దర్శకులు కొత్తవారే అంటూ నాని షాక్ ఇస్తున్నాడు. పెద్ద దర్శకులకు తను కనబడకపోయినా పర్వాలేదు తన కోసం కథ పట్టుకొచ్చిన వారితోనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు నాని. నాని ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో నాని కోసం బడా దర్శకులు ఎందుకు ఆఫర్ చేయట్లేదు అంటే ఒకటి రెండు పెద్ద దర్శకులతో చేసిన సినిమాలు నానికి చేదు అనుభవాన్ని ఇచ్చాయి.


అందుకే నాని కొత్త వారితోనే కమిట్ అవుతున్నాడు. అంతేకాదు అవకాశం చూసే వారికి ఛాన్స్ ఇస్తే వారు తమ ఫుల్ ఎఫర్ట్ సినిమా మీద పెట్టేసి హిట్ అందుకుంటారని నాని నమ్మకం. అందుకే వరుస సినిమాలను హిట్ చేసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది కాని స్టార్ డైరక్టర్ అయితే ప్రస్తుతం 30 కోట్లు ఉన్న మార్కెట్ కాస్త 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. మరి ఆ దిశగా నాని ఆలోచించి తన దగ్గరకు వచ్చే స్టార్ డైరక్టర్ ఆఫర్లను ఓకే చేస్తే బెటర్.



మరింత సమాచారం తెలుసుకోండి: