డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇజం ఫ్లాప్ తర్వాత స్టార్ హీరోలెవరు తనకు అవకాశం ఇవ్వలేదు. చివరి ప్రయత్నంగా బాలయ్యకు కథ వినిపించగా ఓకే చేశాడు. వరుస ఫ్లాపులొచ్చినా సరే తన పంథా మాత్రం మార్చట్లేదు పూరి. అదెలా అంటే సినిమాను చక చకా చుట్టేసి అనుకున్న టైం కు రిలీజ్ చేయడమే పూరి లక్ష్యం. ఈ క్రమంలో అనుకున్న కథ కరెక్ట్ గా వచ్చిందా లేదా అన్నది కూడా చూడట్లేదు.  


అందుకే వరుసగా ఫ్లాపులను ఫేజ్ చేస్తున్నాడు.. అయితే బాలయ్య సినిమాకు అలాంటి తప్పు చేయడు కదా అంటే మళ్లీ సినిమాను చుట్టేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. అనుకున్న డేట్ కు పూర్తి చేయాలనే ఉద్దేశంతో సినిమా మీద గ్రిప్ కోల్పోతున్న పూరి బాలయ్య సినిమా అయినా కాస్త ఆలోచించి చేస్తే బెటర్. ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ కనుక అటు ఇటు అయితే ఇక పూరికి అవకాశం ఇచ్చే వారు కూడా కష్టమే.


ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్న పూరికి బాలయ్య పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకుంటాడో లేదో చూడాలి. సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా పూరి మార్క్ స్టైలిష్ మేకింగ్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. మొదటిసారి క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. శాతకర్ణి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ 101వ మూవీ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: