ఒక్క సినిమా చాలు ఎలాంటి వారికైనా క్రేజ్ తీసుకు రాడానికి అన్నట్టు. ఎవడే సుబ్రమణ్యంతో సపోర్టింగ్ క్యారక్టర్ తో అదరగొట్టి ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కోటి దగ్గరలో తీసుకుంటున్నాడట. పెళ్లిచూపులు ముందు స్టార్ట్ అయ్యింది కాబట్టి ద్వారకకు తక్కువనే తీసుకున్నా కాని ఆ తర్వాత సినిమాలన్నిటికి బాగానే వర్క్ అవుట్ అవుతుందని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు విజయ్.


పెళ్లిచూపులు ఓ రేంజ్ లో హిట్ అవడం వల్ల తనకొచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం కోటికి దగ్గరగా తీసుకుంటున్నా అని తనే చెబుతున్నాడు. ద్వారక సినిమా పెళ్లిచూపులు రిలీజ్ ముందు కమిట్ అయ్యింది. ఒకవేళ పెళ్లిచూపులు సక్సెస్ అయితే ఈ సినిమాకు ఎక్కువ డిమాండ్ చేసేవారా అని అంటే అదేం లేదు తనకు ఎంత ఇవ్వాలో వారికి తెలుసని.. ఆ యూనిట్ అంతా చాలా అనుభవం కలిగిన వారని అన్నాడు.


ఒక్క హిట్ తో కోటి పలుకుతున్న విజయ్ ను చూస్తుంటే ఫ్యూచర్ లో ఇంకా మరింత డిమాండ్ చేసేలానే ఉన్నాడు. మార్చ్ 3న ద్వారక రిలీజ్ అవుతుండగా దాని తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో కూడా రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమాలు పెళ్లిచూపులు రిజల్ట్ ను అందుకుంటాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: