పూరి జగన్నాథ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరి తన స్టైల్ కు భిన్నంగా చేస్తాడని అంటున్నారు. ముహుర్తం డేట్ కే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసే పూరి ఈ సినిమాకు అలానే ఎనౌన్స్ చేసినా సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కాస్టింగ్ కాల్ కూడా ఏర్పాటు చేశాడు పూరి.


చూస్తుంటే పూరి సినిమా కోసం కొత్త స్టైల్ తో తీస్తాడని అనిపిస్తుంది. అంతేకాదు బాలయ్య పక్కన హీరోయిన్స్ ను కూడా కొత్త వారిని తీసుకోనున్నాడట. మహేష్ కోసం రాసుకున్న జనగణమన సినిమానే బాలయ్యతో తీస్తాడని రూమర్స్ వస్తున్నాయి. బాలకృష్ణతో తీసేది ఆ కథ కాదా అన్నది తెలియాల్సి ఉంది. టెంపర్ తర్వాత వరుసగా ఫ్లాపులను ఎదుర్కున్న పూరి బాలయ్య ఇచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకోవాలని చూస్తున్నాడు.


తన స్టైల్ లో ముహుర్తం డేట్ రిలీజ్ డేట్ చెప్పినా ఐదు నెలల్లో తన సత్తా ఏంటో చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. తన కసి అంతా ఈ సినిమాలో చూపించి పూరి హిట్ కొడితే ఏ రేంజ్లో ఉంటుందో ఆ సౌండింగ్ కోసం ట్రై చేస్తున్నాడు. మరి బాలయ్యతో పూరి అనుకున్న ఫీట్ సాగిస్తాడా లేదా అన్నది చూడాలి. సినిమాకు సంబందించిన కాస్టింగ్ కాల్ ఎనౌన్స్ చేశాడు పూరి. మరి బాలయ్యతో నటించే ఆ లక్కీ ఛాన్స్ కోసం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓ ప్రయత్నం చేయడని. 



మరింత సమాచారం తెలుసుకోండి: