యూట్యుబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న ‘కాటమరాయుడు’ టీజర్ ను చూసి మురిసిపోతున్న పవన్ అభిమానులకు మరో జోష్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్. జానపద గీతాలను అందరూ మరిచిపోతున్న నేపధ్యంలో అటువంటి పాటలకు తన సినిమాలలో చోటు కలిగించి జానపద పాటలను తన అభిమానుల దగ్గరకు తీసుకువెళ్ళాడు పవర్ స్టార్.

మొదటి నుంచి జానపద సాహిత్యం అన్నా అలాంటి పాటలు అన్నా మంచి అభిరుచి ఉన్న పవన్ అవకాశం దొరికినప్పుడల్లా తన సినిమాలలో ఈతరహా పాటలను పెట్టి యూత్ ను జోష్ లో పెడుతున్నాడు పవర్ స్టార్.   ‘ఖుషి’ ‘జానీ’ ‘గుడుంబా శంకర్’ ‘పంజా’ లాంటి సినిమాల్లో ఈతరహా ప్రయోగం చేసినతరువాత ‘అత్తారింటికి దారేది’ లో పవన్ పాడిన ‘కాటమరాయుడు’ పాటతో తన పాటను జనంలోకి విపరీతంగా తీసుకు వెళ్ళిపోయాడు. 

ఇప్పుడు మళ్ళీ అదే పాట తన కొత్త సినిమా టైటిల్ గా మారిన నేపధ్యంలో ‘కాటమరాయుడు’ మూవీలో కూడ ఒక జానపద పాటను పెట్టడానికి పవన్ లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈపాటను రామజోగయ్య శాస్త్రి వ్రాస్తే అనూప్ రూబెన్స్ పవన్ సలహాతో ఒక ఫోక్ టచ్ ఉన్న స్టైల్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేసినట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ‘కాటమరాయుడు’ కోసం అనూప్ కొన్ని నెలల కిందటే ట్యూన్స్ రెడీ చేసినా అందులో ఒకటి రెండు పాటల ట్యూన్స్ పవన్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోక్ టచ్ ఉన్న పాట కూడా ఈ ఆడియోలో ఉందని లేటెస్ట్ సమాచారం. ప్రస్తుతం ఆడియోకు ఫైనల్ టచ్ ఇస్తున్న నేపధ్యంలో ఈ కొత్త ఫోక్ సాంగ్ జత చేరింది అని అంటున్నారు. 

ఈ మూవీని ఎట్టి పరిస్తుతులలోను మార్చి 24న విడుదల చేయాలి అని పవన్ పరుగులు తీస్తున్న నేపధ్యంలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించకుండా మరో రెండు వారాలలో ఈ సినిమా పాటలను డైరెక్ట్ గా విడుదల చేస్తారు అని టాక్. అయితే ఈ మూవీ విడుదలకు కొద్ది రోజులు ముందు అభిమానుల మధ్య ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీగా చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: