దశాబ్దం పైగా చరిత్ర ఉన్న మా టీవీకి మీలో ఎవరు కోటీశ్వరుడు షో చాలా పెద్ద ఆస్తి గా ఉండింది. రెండు సంవత్సరాల క్రితం మొదలైన ఈ గేమ్ షో మా టీవీ కే చాలా పెద్ద వెన్ను దన్ను గా నిలిచింది. మా టీవీ చరిత్ర లో సినిమాలకి కాకుండా ఒక షో కి అత్యధిక రేటింగ్ లు వచ్చాయి వాటిని అందిస్తూ టాప్ రియాలిటీ షో గా సాగుతూ వచ్చింది ఈ ప్రోగ్రాం. ఈ కోటీశ్వరుడు దెబ్బకి ఇతర రియాలిటీ షో లు రేటింగ్ లు అనేవి లేక మొత్తం వెల వెల బోయాయి. కొత్త సీజన్ లో నాగార్జున స్థానం లో చిరంజీవి రాబోతున్నాడు అనే వార్తే చాలా హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. ఇక మాటీవీ బృందం అయితే రేటింగ్ ల విషయం లో చాలా లెక్కలు వేసారు. చిరు కి ఫామిలీ, మాస్ ఫాలోయింగ్ లో నాగార్జున ఎందుకూ పనికిరాడు. ఆ మాటకొస్తే ఏ తెలుగు హీరోకీ అంత క్రేజ్ లేదు .


పైగా చిరు రీ ఎంట్రీ చినా 150 తో ఈ విషయం మళ్ళీ రుజువు అయ్యింది. చిరంజీవి మొదటి మీలో ఎవరు కోటీశ్వరుడు షో నే చాలా అట్టహాసంగా మొదలు అయ్యింది. కానీ కట్ చేస్తే రేటింగ్ లు మాత్రం అస్సలు ఊహించినట్టుగా లేవు. ఐదున్నర రేటింగ్ తో కేవలం ఒక సాధారణ షో గా పేలవ ప్రదర్సన ఇచ్చాడు చిరంజీని. బుల్లి తెర మీద చిరు స్టామినా ఇంత వీక్ ఆ అంటూ అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.


చిరు లాంటి పెద్ద స్టార్ వచ్చినా బుల్లితెర ప్రేక్షకులు మినిమం కూడా ఎందుకు కేర్ చెయ్యలేదు అనేది ఇప్పుడు మాటీవీ యాజమాన్యానికి షాకింగ్ ప్రశ్న గా మారింది. ఇది వ్యక్తిగతంగా చిరంజీవి యొక్క ఓటమి అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాగార్జున మొదటి నుంచీ షో ని నడిపించిన పట్టు స్టైల్ జనాలకి బాగా ఎక్కేసింది.. నాగ్ హోస్టింగ్ కోసమే షో ని చూసినవాళ్ళు ఎందరో ఉన్నారు అనడంలో సందేహం లేదు. కౌన్ బనేగా కరోడ్ పతీ అనే హిందీ షో నుంచి మాతృక గా వచ్చిన ఈ షో చాలా బాషలలో లోకల్ స్టార్ లని పెట్టి తీసారు. అయితే అన్ని చోట్లా ఈ షో హిట్ అవ్వలేదు. అమితాబ్ రేంజ్ లో ఈ షో ని దిగ్విజయంగా నడిపింది మాత్రం నాగార్జున అనే చెప్పాలి. కానీ నాగార్జున లెవెల్ తో పోల్చుకుంటే చిరు చాలా చాలా పెద్ద స్టార్ కానీ ఆయన దీన్ని రక్తి కట్టించలేకపోతున్నారు.


జనాలతో కలవడం దగ్గర నుంచీ అనేక విషయాల్లో నాగార్జున తో పోలిక రావడం తో చిరు ఫెయిల్ అవుతున్నారు. చిరు తన నవ్వు ని కూడా కృత్రిమంగా ఇస్తున్నారు అనే అపవాదు కూడా లేకపోలేదు. ఎమోష‌న‌ల్‌గా ఈ గేమ్‌ని న‌డిపించ‌లేక‌పోతున్నాడు. డ్రామాని ర‌క్తిక‌ట్టించ‌లేక‌పోతున్నాడు.. ఇలా ర‌క‌రకాల కార‌ణాలు చెబుతున్నారు విశ్లేష‌కులు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న చిరు ఇలా హాట్ సీట్ ఎదురుగా కూర్చుని క్లాస్ డీలింగ్ చేస్తుంటే జనం వంట పట్టించుకోవడం లేదు అని చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: