సౌత్ సూపర్ హీరోయిన్ సమంత కేవలం యాక్టింగ్ మాత్రమే చేస్తుందా అంటే కాదు కాదు ఆమెలో చాలా టాలెంట్ ఉంది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సమంతలో ఏ టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఆమెలోని రైటింగ్ టాలెంట్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అయ్యింది. ఏడేళ్ల తన సిని కెరియర్ గురించి ఓ ఆర్టికల్ రూపంలో రాసిన సమంత అందులో తన అనుభవాలన్ని పంచుకుంది. 


తన ఈ 7 ఏళ్ల కెరియర్ మొత్తాన్ని ఆర్టికల్ లో పొందుపరచిన విధానం చూస్తుంటే కచ్చితంగా సమంత రైటర్ గా కూడా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు. సమంత రాసిన ఈ ఆర్టికల్ కు సెలబ్రిటీస్ లైకులు కొట్టేస్తున్నారు. అనుభవాలను కూడా అందంగా అమర్చి రాసిన ఈ ఆర్టికల్ తో సమంత టాలెంట్ కూడా బయటపడుతుంది. ఇన్నాళ్లు సమంత హీరోయిన్ మాత్రమే అనుకున్నాం కాని ఆమెకు ఛాన్స్ ఇస్తే రైటింగ్ లో కూడా అదరగొడుతుంది అంటున్నారు. 


ఈమధ్యనే నిర్మాతగా మారాలన్న ఆలోచన రాగా ఇప్పుడు సెలబ్రిటీస్ తన ఆర్టికల్ కు ఇస్తున్న ప్రోత్సాహం చూసి సమంత కూడా రైటర్ గా మారే అవకాశం ఉంది. నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమవుతున్న సమంత ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది. రీసెంట్ గా సినిమా షూటింగ్ స్పాట్ లో లీక్ అయిన పిక్ చూసి సమంత తన ప్రొఫెషన్ ను ఎంత ప్రేమిస్తుందో అర్ధమయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: