ఒక సినిమాను మార్కెట్ చేయడంలో రాజమౌళికి తెలిసినంత టెక్నిక్స్ భారతదేశంలో మరి ఏదర్శకుడుకి తెలియదు అని అంటారు. అందుకే ప్రముఖ మేనేజ్ మెంట్ కాలేజీలు కూడ రాజమౌళిని తమ కళాశాలలకు ఆహ్వానిస్తూ తమ విద్యార్ధులకు మోటివేషన్ క్లాసులు ఇప్పిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజమౌళి శిష్యుడు ప్రభాస్ రాజమౌళి మైండ్ ను బ్లాంక్ చేసే విధంగా వేసిన ఎత్తుగడకు జక్కన్న షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే ‘బాహుబలి’ బంధిఖానా నుండి బయట పడ్డ ప్రభాస్ అతిత్వరలో తన సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో 150 కోట్ల భారీ సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈమూవీ షూటింగ్ ను ఏప్రియల్ నుంచి మొదలు పెడతారు అని అనుకున్నారు అంతా. 

అయితే ఈ మూవీ షూటింగ్ ఎవరూ ఊహించని విధంగా రాబోతున్న మార్చిలోనే ప్రారంభం కాబోతోందని టాక్.  ఈ మూవీకి సంబంధించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఒక వారంరోజుల పాటు చిత్రీకరించి ఆ యాక్షన్ సీన్ లోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ గా మార్చి ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ సినిమా ధియేటర్లలో ట్రైలర్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శింప బోతున్నారని ఫిలింనగర్ టాక్. 

దీనివల్ల ప్రభాస్ సుజిత్ ల కాంబినేషన్ లో మొదలు పెట్టబోతున్న మూవీకి ప్రారంభం నుండే భారీ స్థాయిలో క్రేజ్ రావడమే కాకుండా ‘బాహుబలి 2’ లాంటి ప్రతిష్టాత్మకమైన భారీ సినిమాను చూడటానికి వచ్చే లక్షలాది ప్రేక్షకులకు ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు సంబంధించిన విశేషాలు చాల సులువుగా ప్రభాస్ అభిమానులకే కాకుండా అందరికీ తెలుస్తుంది అన్న వ్యూహంలో ప్రభాస్ సుజిత్ లు ఉన్నట్లు టాక్.  దీనితో ‘బాహుబలి 2’ ను ప్రభాస్ వ్యూహాత్మకంగా తన కొత్త సినిమా ప్రమోషన్ కు కూడ వాడుకుంటున్నాడనుకోవాలి. 

ఇది ఇలాఉండగా ‘బాహుబలి 2’ ప్రమోషన్ ను వచ్చే నెల రాబోతున్న ‘ఉగాది’ పండుగ రోజు నుండి మొదలు పెట్టి సుమారు నెలరోజుల పాటు మీడియా అంతటా ‘బాహుబలి 2’ హవా కనిపించే విధంగా దర్శకుడు రాజమౌళి భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: