పవన్ సినిమాలో కనిపిస్తే చాలు అనుకునే ఆర్టిస్టులు చాలామంది ఉన్న నేపధ్యంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు తమ్ముడు క్యారక్టర్లో  నటించడమే కాకుండా దాదాపు నెలరోజులు షూటింగ్ కు రావడం పవన్ తో  టైమ్ స్పెండ్ చేయడంతో చాలా ఎక్స్ యిట్మెంట్ మూడ్ లో ఉన్నాడు శివబాలాజీ. దీనితే తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ తన తరుపున గుర్తుగా ఒక జ్ఞాపికను ప్రెజంట్ చేయాలని  భావించిన శివబాలాజీ పవన్  కు ఒక ఊహించని గిఫ్ట్ ఇచ్చి పవన్ కి షాక్ ఇచ్చాడు. 

చూడటానికి కత్తి తరహాలో ఉన్న ఈ షీల్డు పై పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వాక్యాలు కూడా రాసున్నాయి. ఈ కత్తిని  పవన్ కు ప్రెజంట్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న ఆలీతో కలసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అలాగే ఆ కత్తితో సరదాగా ఆలి చేతికి టార్గెట్ పెట్టడం లాంటి విషయాలన్నీ కలిపి ఒక వీడియోను రిలీజ్ చేశారు. 

దీనితో ‘కాటమరాయుడు’ చేతిలో కత్తి అంటూ ఈ వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్ చాలా జోష్ లో ఉన్నారు. అంతేకాకుండా ఆ కత్తి ఫోటోలను ఒకరి కొకరు షేర్ చేసు కుంటున్నారు. 

ఇది ఇలా ఉండగా నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ ను షేక్ చేసింది. పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించి నాలుగు నిమిషాల యాక్షన్ సీన్స్ లీకైనట్టు వార్తలు వచ్చాయి. ఈవార్తలలో ఎన్ని యదార్దాలో తెలియక పోయినా ఈసీన్స్ ఇంటర్వెల్ ముందు వస్తాయని ప్రచారం కూడ జరిగింది. రైల్వే‌స్టేషన్‌లో  జరిగిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. 

అయితే ఫిలింనగర్ లోని కొన్ని వర్గాలు మాత్రం ఈసినిమాకు మరింత హైక్ ను తీసుకు రావడానికి కావాలనే ఈ యాక్షన్ సీన్స్ లీక్ చేసారు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇప్పటికే 80 కోట్ల పైనే బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ బయ్యర్లు లాభ పడాలి అంటే కనీసం ఈసినిమాకు 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చి తీరాలి. ఈ పరిస్థుతులలో పవన్ మ్యానియా ఎంత వరకు ఈసినిమాను రక్షిస్తుంది అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్త పరుస్తున్నారు..     


మరింత సమాచారం తెలుసుకోండి: