నందమూరి బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అందరూ. ఫిలిం నగర్ లో వచ్చిన ఈ వార్త మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకీ చేరడానికి ఎంతో టైం పట్టలేదు కూడా. అయితే బాలకృష్ణ ని పూరీ ఒక రేంజ్ లో చూపిస్తాడు అంటున్నారు పూరీ జగన్నాథ్ దగ్గరి వారు.


బాలయ్య ని బోయపాటి శ్రీను చూపించినంత పర్ఫెక్ట్ గా ఎవ్వరూ చూపించలేరు అనేది వాస్తవం. ఒక మూస పద్దతిలో సినిమాలు చేస్తూ వెళుతున్న బాలయ్య తో  ‘సింహా’ సినిమాలో సరికొత్తగా ప్రెజెంట్ చేసి నందమూరి అభిమానుల్ని అలరించాడు బోయపాటి. ఆ ఊపు ‘లెజెండ్’లోనూ కొనసాగింది. 


శాతకర్ణి తో బాలయ్య 100 సినిమాలు పూర్తి చేసుకున్నాడు, 101 వ సినిమాకి డైరెక్షన్ చెయ్యబోతున్న పూరీ.. బాలయ్య ని తెర మీద ఏ విధమైన యాటిట్యూడ్ తో చూపిస్తాడు అనేది చాలా ఆసక్తికర విషయం. ఏ హీరోకైనా తన దైన యాటిట్యూడ్ టచ్ ని చూపిస్తూ ఉంటాడు పూరీ జగన్నాథ్. బాలయ్యని కూడా ఫుల్ యాటిట్యూడ్ తో పొగరుతో చూపించే స్క్రిప్ట్ ని పూరీ సిద్దం చేశాడట. ‘ఇజం’ సినిమా ఎలా ఆడినప్పటికీ కళ్యాణ్ రామ్ ను పూరి చూపించిన విధానం చాలా కొత్తగా అనిపించింది.


అలాగే బాలయ్యను కూడా ప్రెజెంట్ చేయడానికి స్కెచ్ రెడీ చేశాడట పూరి. టెంపర్ లో ఎన్టీఆర్ ని మేక్ ఓవర్ చేసిన తీరు ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు అలాగే బాలయ్య నిజజీవితం లో ఉండే కొన్ని అంశాలని కూడా చూపించి పూరీ ఒక సరికొత్త బాలకృష్ణ ని ఆవిష్కరించాలి అని చూస్తున్నాడట.బాలయ్య మేనరిజమ్స్.. బాడీ లాంగ్వేజ్.. పరిశీలించి అచ్చం అలాగే తెరమీద చూపించేలా కథ కూడా తయారు చేశాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: