టాలీవుడ్ ప్రిన్స్ గా మహేష్‌ సాధిస్తున్న అనూహ్య విజయాల వెనుక మహేష్ భార్య నమ్రత ప్రోత్సాహం ఉంది అన్న కామెంట్స్ ఇప్పటికే పలు సందర్భాలలో చాలామంది చేస్తూ ఉంటారు. అయితే నమ్రత మటుకు దీనికి భిన్నంగా తనకు మహేష్ లాంటి గొప్ప వ్యక్తిని కలవడం  తన జీవితంలో చేసుకున్న అదృష్టమని ఆతరువాత అతడిని భర్తగా పొందిన తరువాత తల్లిదండ్రులని అమితంగా ప్రేమించే బిడ్డగా మహేష్ గొప్పతనాన్ని తెలుసుకున్న తనకు భార్యను పిల్లలను అపరిమితంగా ప్రేమించే వ్యక్తిత్వాన్ని మహేష్ లో చూసాను అని అంటోంది నమ్రత.

ఒక మీడియా సంస్థకు ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మహేష్ గొప్పతనాన్ని వివరిస్తూ అనేక ఆసక్తికర కామెంట్స్ చేసింది. గౌతమ్‌ పుట్టిన కొంత కాలానికి తన తల్లి, తండ్రి తక్కువ గ్యాప్‌లోనే మరణించినపుడు తన పనులన్నీ మానేసి, తనతో పాటే మహేష్ ఉండేవాడని చెపుతూ తనకు మానసికంగా ఎంతో సపోర్ట్‌ మహేష్ ఇచ్చాడని ఆనాటి విషయాలను గుర్తుకు చేసుకుంది నమ్రత. 

అంతేకాదు మహేష్‌ సినిమాలకు సంబంధించి ‘ఖలేజా’ తర్వాత మహేష్‌కి గ్యాప్‌ రావడానికి కారణం ఒక విధంగా తాను మాత్రమే అంటూ మహేష్ నటించిన ‘ఖలేజా’ మూవీకి ‘దూకుడు’ సినిమాకి మధ్య ఉన్న పెద్ద గ్యాప్ కు గల కారణాలను వివరించింది నమ్రత. ఇదే సందర్భంలో మహేష్ గురించి మాట్లాడుతూ ఒక బ్రిలియంట్‌ యాక్టర్‌ గా కన్నా అన్నిటికంటే గొప్ప హ్యూమన్‌ బీయింగ్‌ గా తాను మహేష్ ను గౌరవిస్తాను అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపించింది ఒకనాటి ఈ మిస్ ఇండియా.

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ , మహేష్ దత్తత తీసుకున్న రెండు గ్రామాల అభివృద్ధిలో తాను కీలక పాత్ర పోషిస్తూ ఆ వర్క్ ను ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని బయట పెట్టింది. ఈమధ్య కాలంలో తన పై వస్తున్న రూమర్ల పై స్పందిస్తూ తనక్ మహేష్ ను అతడి పిల్లలను చూసుకోవదానికే టైమ్ లేని నేపధ్యంలో తాను సినిమాలలో మళ్ళీ నటిస్తున్నాను అంటూ మీడియా ఎలా వార్తలు వ్రాస్తోందో తనకే అర్హం కావడం లేదు అంటూ సెటైర్లు వేసింది నమ్రత.  

అంతేకాదు ఈమధ్య కాస్త తన లుక్ మార్చుకుని కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటే అది సినిమాల కోసం ప్రిపరేషన్ అంటూ వార్తలు వ్రాస్తే ఎలా అంటూ మీడియానే ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా నమ్రత ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వందల సార్లు మహేష్ నామస్మరణ చేయడం బట్టి మహేష్ పై ఆమెకు ఉన్న ప్రేమను మరొకసారి నిరూపించుకుంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: