సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటారు. అందుకే సినీ ఫీల్డ్ లోకి అమ్మాయిలను పంపేందుకు ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు ఏమాత్రం ఇంట్రస్ట్ చూపరు. ఒక వేళ తమ ఆడపిల్లలను సినిమా ఇండస్ట్రీకి పంపుతున్నారంటే అందుకు పర్యవసానాలను వారు ముందుగానే అంచనా వేసుకుని ఉంటారు. సినీపరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చే వారు మాత్రం చాలా ఇబ్బందిపడతారు. 

madhavi latha hd కోసం చిత్ర ఫలితం

సినీ హీరోయిన్ కావాలనుకుంటున్న అమ్మాయిల కష్టాలపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.. అవన్నీ అక్షరాలా నిజం అంటోంది  ఓ మాజీ హీరోయిన్.. ఓ సూపర్ హిట్ సినిమాతో పరిచయమైనా.. ఆ  తర్వాత అవకాశాలు లేక కెరీర్ ను వదిలేసుకున్న మాజీ హీరోయిన్ తాజాగా చెప్పిన విషయాలు చూస్తే.. సినీరంగంలోని గుంటనక్కల వివరాలు మారోసారి బయటపడ్డాయనిపిస్తోంది. 

సంబంధిత చిత్రం
తనను ఓ డైరెక్టర్ వాడుకోవాలని చాలా ప్రయత్నించాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నచ్చావులే ఫేం హీరోయిన్ మాధవీలత.. తాను అందుకు కోపరేట్ చేయలేదని తనకు అవకాశాలు రాకుండా చేశారని.. తనపై ఇగోయిస్ట్, యాటిడ్యూట్ గర్ల్ గా ప్రచారం చేశారని చెప్పింది మాధవీలత. సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలను పడుకుంటావా అని  చాలా స్మూత్ గా అడుగుతారని చెప్పుకొచ్చిందామె.

సంబంధిత చిత్రం
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో ఎంజాయ్ చేయడానికి ఒప్పుకోకపోని వారి జీవితం నరకప్రాయంగా ఉంటుందని.. అందుకే చాలా మంది నటీమణులు రాజీపడిపోతుంటారని చెప్పింది మాధవీలత. తమతో పడుకోవాలని ఎంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినీ పరిశ్రమ పెద్దలు.. చాలా డీసెంట్ ప్రపోజల్స్ చేశారని చెప్పిన మాధవీలత.. అవన్నీ బయటపెడితే సినిమా ఇండస్ట్రీలో చాలా కాపురాలు కూలిపోతాయని చెప్పిందామె. 

madhavi latha hd కోసం చిత్ర ఫలితం
మాధవీలత చెప్పిన విషయాలు ఇండస్ట్రీలో కొత్తేమీ కాకపోయినా.. ఆత్మగౌరవం ఉండి..ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేని అమ్మాయిలు సినిమా ఇండస్ట్ర్రీలో ఎంతగా సఫర్ అవుతారో మరోసారి కళ్లకుకట్టింది. సినీరంగాన్ని ఓ రంగుల కలగా భావించి హీరోయిన్ గా తెరపై వెలిగిపోదామని వచ్చే అమ్మాయిలు ఒక్కసారి మాధవీలత ఇంటర్వ్యూ చూస్తే మంచిదేమో..



మరింత సమాచారం తెలుసుకోండి: