ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మ‌రోసారి  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అత‌ని మాజీ భార్య రేణు దేశాయ్‌. గ‌తంలో చాలా సార్లు త‌న మాజీ భ‌ర్త వెన‌కేసుకు వ‌చ్చిన ఆమె స‌డ‌న్‌గా మట మార్చింది. భ‌ర్త‌గా ప‌వ‌న్ కళ్యాణ్ ఏవ‌రేజేన‌ని చెప్పేసింది.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతోంది. అయిన ప్పటికీ, పవన్ గురించి ఆమె చెప్పే విషయాలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. 


ఈ నెల 8న మహిళా దినోత్సవం నేప థ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్’ లో భాగంగా పవన్ గురించి రేణూ దేశాయ్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.  భర్తగా, తండ్రిగా, నటుడి గా, రాజకీయ నాయకుడిగా పది మార్కుల చొప్పున పవన్ కల్యాణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు రేణూ స్పందిస్తూ.. భర్తగా పవన్ ‘యావరేజ్ స్టూడెంట్’ అని, పదికి నాలుగు లేదా ఐదు మార్కులు మాత్రమే ఇస్తానని, తండ్రిగా పదికి వంద మార్కులు, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులు వేస్తానని రేణూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. 

పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడిపోయినప్పటి నుండి ఆమె పై మీడియా దృష్టి ఎక్కువైంది. ఆమె చుట్టూ ఏం జరుగుతోంది, పవన్ తో ఆమె సాన్నిహిత్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. రేణు దేశాయ్ కూడా అడపాదడపా తన ట్విట్టర్ అకౌంట్లో పవన్ కు సంబందించిన విషయాల మీద మాట్లాడు తూ కాస్త సంచలనం సృష్టించేవారు.

మరీ, భవిష్యత్ లో ఏం చేస్తారో తెలియదు గానీ, పవన్ ఆలోచనలు బాగున్నాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పు కొచ్చిం ది. ఈ ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం రోజున ప్రసారం కానుంది. అయితే, ఇందుకు సంబంధించి ప్రోమో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: