ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు అంతా టెన్షన్లో పడ్డారు..‘సుచీలీక్స్’ తో తమ బాగోతాలు ఏప్పుడు బయట పడతాయో అని.  గత కొంత కాలంగా కోలీవుడ్ పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న సుచిత్రా కార్తిక్ తన ట్విట్టర్ అకౌంట్ లో నటీనటుల క్లోజ్ గా ఉన్న ఫోటోలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.   ఈ అమ్మడు  ధనుష్ – త్రిష, అనిరుద్ – ఆండ్రియా, హన్సిక, యాంకర్ దివ్యదర్శిని లాంటి స్టార్ హీరో హీరోయిన్ల పర్సనల్ ఫోటోలను బయట పెట్టి రచ్చరచ్చ చేసింది.  ఇక ఆ ఫోటోల్లో ఉంది మేం కాదు.. మేం కాదంటూ సెలబ్రెటీలు ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు. కానీ ఈ వ్యవహారంపై సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ ఇచ్చిన వివరణ మరో విధంగా ఉంది.

తన భార్య మానసిక సమస్యతో బాధపడుతోందని, అందరూ అర్థం చేసుకోవాలని చెప్పాడు. తాజాగా మరో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు కూడా ఉండటం చాలామందిని షాక్ కి గురిచేసింది.చిన్మయి కి సంబధించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. ”డ్యూడ్.. పెళ్లికు ముందు నాలుగు అబార్షన్ లు చేసుకున్నావ్. డాక్టర్ రిపోర్ట్లు సహా నా దగ్గర ఆధారాలు వున్నాయి బయటపెట్టమంటావా? అంటూ ట్విట్టర్ లో హెచ్చరించింది సుచిత్ర. దీనిపై స్పందించిన తన భర్త రాహుల్, తానూ సుచిత్ర భర్త కార్తీక్‌తో మాట్లాడామని చిన్మయి చెప్పింది.
Related image
సుచిత్ర ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కార్తీక్ చెప్పాడని తెలిపింది. మానసిక రుగ్మతలు ప్రతీ ఒక్కరికీ ఎదురవుతాయని చిన్మయి చెప్పింది.  తన ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా చేసుకుని సుచిత్ర చేస్తున్న రచ్చకు ఎంతో మంది మానసిక వేదన అనుభవిస్తున్నారని అంటూ ..ఈ విషయంలో తనకు అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలని చిన్మయి తెలిపింది.

Image result for సింగర్ చిన్మయి


మరింత సమాచారం తెలుసుకోండి: