సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోల మద్య ఈగో ఫీలింగ్ ఉంటుందని..తమ స్థాయి తగ్గుతుంటే ఆ హీరో వల్లే జరుగుతుందన్న ఈర్ష్య ఉంటుందని వార్తల్లో చదువుతుంటాం.  వాస్తవానికి కొంత మంది హీరోల్లో జరిగి యాదార్థ సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి.  అంతే కాదు పెద్ద హీరోల అభిమానులు మరో హీరోని తిట్టడం లాంటివి చేస్తే తమ అభిమానులను వెనుకేసుకు రావడం పరిపాటి..కాకపోతే మేమంతా ఒక్కటే అన్న స్టేట్ మెంట్ మాత్రం ఇస్తారు.  అసలు హీరోలు తిట్టుకోకుండానే హీరోల అభిమానులు రోడ్డున పడి తిట్టుకోవడం , కొట్టుకోవడం చేస్తుంటారు ఇక హీరోలు ఇద్దరు కూడా గొడవ పడితే ఇంకా వేరే చెప్పాలా ? ఇప్పుడు అదే జరుగుతోంది కన్నడ నాట.  
Image result for sudeep adarsh
కన్నడ హీరో అయిన సుదీప్ తెలుగు లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈగ, బాహుబలి చిత్రంలో నటించిన సుదీప్ కన్నడంలో స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు.  ఇక కన్నడంలో మరో స్టార్ హీరో దర్శన్..అయితే గత కొంత కాలంగా వీరి మద్య కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో  సుదీప్ - దర్శన్ లు ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే వారని కాకపోతే వీరి మద్య వచ్చిన గొడవతో ఆ ఫ్రెండ్ షిప్ బెడిసి కొట్టిందని అంటున్నారు.  అంతే కాదు సుదీప్ నా మిత్రుడు కాదు .. సాటి హీరో మాత్రమే ! అని దర్శన్ ట్వీట్ చేయగా ... అసలు మెజిస్టిక్ చిత్రంలో నటించే ఛాన్స్ నేనే దర్శన్ కు ఇప్పించాను అంటూ సుదీప్ ట్వీట్ చేసాడు దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది .
Image result for sudeep darshan
ఇక వరుస పెట్టి ట్వీట్ లు చేసుకుంటూ ఒకరి పై మరొకరికి ఉన్న కోపాన్ని ప్రదర్శించు కుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోలు గొడవ పెట్టుకుంటే వారి అభిమానులు ఊరుకుంటారా..వాళ్లు కూడా రెచ్చిపోయి మరీ  రోడ్ల మీదకు వచ్చి సుదీప్ ఫ్యాన్స్ ని దర్శన్ ఫ్యాన్స్ తిట్టడం , దర్శన్ ఫ్యాన్స్ ని సుదీప్ ఫ్యాన్స్ తిట్టుకోవడం చేస్తున్నారు . ఈ గొడవ మరింతగా ముదరక ముందే జోక్యం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట కన్నడ సినీ పరిశ్రమ పెద్దలు.



మరింత సమాచారం తెలుసుకోండి: