తెలుగు ఇండస్ట్రీలోకి చిన్న కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు లారెన్స్ రాఘవ.  ఇప్పటి వరకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ..హీరోగా నటిస్తూ మాస్ ప్రేక్షకుల బాగా దగ్గరయ్యారు.  హర్రర్ కాన్సెప్ట్ తో తీసిన ముని చిత్రం లారెన్స్ కి బాగా కలిసి వచ్చింది.   ఈ చిత్రానికి సీక్వెల్ గా కాంచన, గంగ సినిమాలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఇక లారెన్స్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..అమ్మా, తమ్ముడు ఎంటే ఎంతో అభిమాస్తాడు..అంతే కాదు తల్లికోసం ఏకంగా ఓ పాలరాతి శిల్పాన్నే తయారు చేయించాడు.  
Image result for raghava-lawrence-helps farmers
అంతే కాదు  తాను నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది నిరుపేదలు, అనాధలకు, స్కూల్ విద్యార్థులను ఆదుకుంటున్నాడు.  ఆ మద్య చెన్నైలో వచ్చిన వరదలకు అక్కడి ప్రజలు విల విలాడుతున్న సమయంలో అందరికంటే ముందు ఐదు కోట్లు విరాళం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.  అంతే కాదు స్వయాంగా వరదబాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.  ఆ మద్య ఓ పాపకు గుండె ఆపరేషన్ చేయించాడు.  
Related image
అలాగే మొన్న జరిగిన జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న యువతకు ఆహారం సమకూర్చడానికి కోటి రూపాయలు వరకూ ఖర్చు చేశాడు.  ఇలా లారెన్స్ చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి..తాజాగా మరో మహత్కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే పలువురు చిన్నారులకు ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చిన లారెన్స్ తాజాగా తమిళనాడు రైతులను ఆదుకోవడానికి నడుం బిగించాడు. తమిళనాట తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న రైతులు దాదాపు 270 మంది తనువు చాలించారు.
Image result for raghava-lawrence-helps farmers
వారి కుటుంబాల దీన గాధ విన్న లారెన్స్ చలించిపోయాడు..వెంటనే వారికి అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నాడు.   దీనిపై లారెన్స్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబం ఇటీవల నన్ను కలసింది. వెంటనే వారికి రూ.3 లక్షలు ఇచ్చాను. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. తమిళనాడులో ఇప్పటి వరకు 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఆ కుటుంబాలన్నీ వీధిన పడుతున్నాయి. వారికి సహకరించాలని నేను ప్రభుత్వాన్ని కోరను. 271 కుటుంబాలకు వ్యక్తిగతంగా నేను నా శక్తి కొద్దీ సాయం అందజేస్తా. విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి నిధి సేకరిస్తా. సినిమా పరిశ్రమ కూడా సహకరిస్తుందని బావిస్తున్నా” అని చెప్పుకోచాడు లారెన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: