తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది తమిళ హీరోలు వచ్చారు. అయితే రజినీకాంత్ తర్వాత అంత మంచి క్రేజ్ సంపాదించిన హీరో సూర్య ఒక్కడే.  గజిని చిత్రం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సూర్య కి ఎంతో మంది తెలుగు అభిమానులు పుట్టుకొచ్చారు.  అయితే సూర్య తో పాటు ఆయన తమ్ముడు కార్తీ కూడా అడపాదడపా తెలుగులో వస్తున్న డబ్బింగ్ చిత్రాల్లో కనిపిస్తున్నాడు. గత సంవత్సరం ఊపిరి చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

 ఇక తెలుగులో సంగం సీరీస్ తో వచ్చిన సినిమాలన్నీ మంచి ఆదరణ పొందాయి. రీసెంట్ గా సింగం 3 కూడా తెలుగు లో భారీ కలెక్షన్లు రాబట్టింది.  తమిళంలో ప్రముఖ హీరో శివకుమార్ తనయులు ఇద్దరు హీరోలు.  సూర్య 2009 నాటికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు.  

తన సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  రజనీకాంత్ తరువాత లింగాయత్ వర్గం నుంచి దక్షిణ భారత స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు సూర్య.  ఇక చిన్నతనంలో సూర్య, కార్తీ తీయించుకున్న అపురూప చిత్రం మీకోసం. 


మరింత సమాచారం తెలుసుకోండి: