క్యూట్ హీరోయిన్ సమంత పెళ్ళికి సంబందించిన వార్తలు లేకుండా మీడియా లో ఒక్కరోజు కూడా గడవడం లేదు. క్రితం సంవత్సరం సమంత నటించిన రాజమౌళి ‘ఈగ’ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనకు ఎంపిక కావడంతో ప్రస్తుతం సమంత హవా అంతర్జాతీయ సినిమా ప్రేక్షకుల స్థాయికి చేరిపొయింది. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత కొన్ని ఆశక్తికర విషయాలను వెల్లడించింది. ఈగ సినిమాలో తనకు అంత పేరురావడానికి దర్శకుడు రాజమౌళి వల్లనే జరిగిందని చెపుతూ, అందుకే తాను ఎంపిక చేసుకొనే సినిమాలలో ఆ సినిమా ధర్శకుల స్థాయిని ప్రప్రధమంగా పరిగణలోకి తీసుకుంటానని, హీరో ఎవ్వరు అనే విషయం తరువాత ఆలోచిస్తానని, అందుకే మంచి దర్శకులు తీసే చిన్న సినిమాలు అయినా తనకు నటించడానికి అభ్యంతరం ఉండదని చెపుతూ, ఈమధ్యనే విడుదల అయి విజయం సాధించిన ‘పిజ్జా’, ‘ప్రేమ కధాచిత్రమ్’ సినిమాల లాంటి వెరైటీ స్క్రిప్ట్ లతో ఎవరైనా తన దగ్గరకు వస్తే తన కాల్ షీట్స్ వెంటనే ఇస్తానని చెపుతోంది సమంత.

ఇక తన ‘అత్తారింటి దారేది’ సినిమా గురించి మాట్లాడుతూ, తాను నటించడం మొదలు పెట్టాకా పవన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోని తాను ఇంతవరకూ చూడలేదని, తన అభిమానుల చేత మెగా హీరోగా ఆరాధింపబడుతున్న పవన్ చాలా సింపుల్ గా, హంబుల్ గా ఉంటాడని, షాట్ అయిపోయిన తరువాత తన పని ఏదో తానే కాని ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి ఆయన మాట్లాడడని, ఆ సంస్కారం తనకు ఎంతో నచ్చిందని చెప్పింది సమంత.

ఇక తన ప్రియమిత్రుడు సిద్ధార్ద్ గురించి మాట్లాడుతూ, సిద్ధూ తనకు అత్యంత సన్నిహితమైన మిత్రుడు అని, తామిద్దరం రకరకాల సందర్భాలలో కలిసి తిరిగిన వాస్తవాలను తాను ఖండించనని, కాని సిద్ధార్ద్ కు తనకు ఉన్న అనుబంధం ఏమిటి..? అన్నది సరైన సమయ౦లో, సరైన పద్ధతిలో తానే వెల్లడిస్తానని, అప్పటి దాకా తనకూ సిద్ధూ కూ మధ్య ఎన్ని సమ్ థింగ్ సమ్ థింగ్ వార్తలు రాసుకున్నా తాను ఎవరినీ కేర్ చెయ్యనని చెపుతూ మరొక లేటెస్ట్ ఫ్లాష్ వదిలింది సమంత. తాను మరో మూడు సంవత్సరాల వరకూ పెళ్ళి చేసుకోవడం లేదని, అప్పటిదాకా తాను సినిమాలలోనే నటిస్తానని, కాజల్,తమన్నా,ఇలియానా లాగా కాసేపు టాలీవుడ్,మరికాసేపు బాలీవుడ్ అంటూ తనకు కంగారు లేదని, ఈ మూడు సంవత్సరాలు తెలుగు,తమిళ సినిమాలలో నటిస్తానని, చిన్న హీరోలతోనైనా తనకు అభ్యంతరం లేదని, అప్పటిదాకా ఎవరు ఏ వార్తలూ, తనకూ సిద్ధూ కూ మధ్య బంధం పై రాసుకోవచ్చని నవ్వుతూ చెప్పింది సమంత. దీనితో సమంత తన కెరియర్ ప్లాన్ మర్చుకుందా..? లేక పెళ్ళి వాయిదా వేసుకుందా..? లేదంటే సమంత యు టర్న్ తీసుకుందా..? అనే కోణాలలో ఎవరికి తోచిన వార్తలు వారు రాసుకోవడానికి బోలెడు చాన్స్ ఇచ్చేసింది ఈ టాలీవుడ్ రారాణి.   

మరింత సమాచారం తెలుసుకోండి: