తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత దర్శకధీరుడు రాజమౌళికి దక్కుతుంది.  రెండు సంవత్సరాలు సుధీర్ఘంగా కష్టపడి ‘బాహుబలి’ చిత్రాన్ని అందించారు.  ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని ఫ్యూజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు.  అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ అంటే చిన్న తనంగా చూసే తమిళ, హిందీ ఇండస్ట్రీలు షేక్ చేశాడు.  ఇక ఈ చిత్రం సీక్వెల్ బాహుబలి 2 షూటింగ్ పూర్తికావొచ్చింది.  తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది.

వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న బాహుబలి టీం గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ట్రైలర్ మీద అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. గత కొద్ది రోజులుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే ట్రైలర్ కి  సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు ఈ ట్రైలర్ కు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు.  సినిమా గ్రాండియర్తో తో  పాటు క్యారెక్టర్స్, పోరాట సన్నివేశాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించిన  ట్రైలర్ లో పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది.

బాహుబలి 2 ట్రైలర్ ని ముంబయి లో దిగ్గజాల మద్య రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు.  చిత్ర యూనిట్ ఈ రోజు ఉదయం 9గం.ల నుండి 10గం.ల మధ్య ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కాని తమిళంలో ముందుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై అభిమానుల్లో జోష్ ని పెంచింది. ప్రస్తుతం తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుంది.  ప్రస్తుతం తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుంది.

ట్రైలర్ చాలా గ్రాండియర్ గా ఉండగా ఇందులో సినిమాకు సంబంధించిన పాత్రలు, పోరాట సన్నివేశాలు, కుటిల రాజకీయాలు ఇలా అన్ని అంశాలు పొందుపరచబడినాయి. మరి కొద్ది గంటలలో తెలుగులోను ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి..ఇంత గొప్ప యుద్ద సన్నివేశం ఇప్పటి వరకు హాలీవుడ్ లో కూడా చూసి ఉండరనిపిస్తుంది.  మొత్తానికి రాజమౌళి చెప్పింది చూపించాడని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ ట్రైలర్ తెలుగు కూడా రిలీజ్ చేశారు..ఇక  హిందీలో చూసి భారత దేశం మొత్తం ఎలా స్పందిస్తో చూడాలి.  




మరింత సమాచారం తెలుసుకోండి: