Image result for rana prabhas in baahubali 2



అసలు విషయం లేకపోయినా కొన్నిసందర్భాలను  చెప్పే విధానము లోనే చాతుర్యం బయట పడుతుంది. ఆ విధమైన హ్యూమర్ సినిమా ప్రచారాన్ని అ అంశాలను బాలా ఎలవేట్ చేస్తాయి. ఏంటబ్బా అనిపిస్తూ ఊరిస్తాయి. అలాంటి సందర్భమే, ‘బాహబలి-2’ (ది కంక్లూజన్) ట్రైలర్ విడుదల కార్యక్రమం లో ఓక సరదా సన్నివేశం చోటుచేసు కుంది. ఒక సినిమా న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘బల్లాలదేవుడు’ అదే రానా తనదైన శైలి లో సమాధానం చెప్పాడు. దీంతో కార్యక్రమ ప్రాంగణములో ఉన్న వారందరి ముఖాల్లో ఆనందం నవ్వుల పువ్వులై అందరి ముఖాల్లో వెల్లి విరిశాయి.


 ఒక  రిపోర్టర్ అడిగిన  ప్రశ్నే మంటే - బాహుబలి పార్ట్-1లో మీకు కనీసం ఒక పాట కూడా లేదని మీ అభిమానులు ఫీలయ్యారు, ఈ రెండో పార్ట్‌లో నైనా మీకు పాట ఉంటుందా?  అని ప్రశ్నించగా! పక్కనే ఉన్న బాహుబలి-2 పోస్టర్ చూపిస్తూ: 


"ఆ పోస్టర్‌లోని ప్రతినాయకుణ్ణి బల్లాలదేవుడి పాత్రలో ఉన్న రానా- ని చూస్తుంటే పాటలో నర్తించే వాడిలా కనిపిస్తున్నాడా? ఆ సీరియస్నెస్ ని ఒకసారి క్లియర్‌గా చూడండి" అంటూ సమాధానం ఇచ్చాడు. 


Related image



అంతేకాదు పార్ట్-1లో  "మనోహరి"  విలన్స్ డెన్ సాంగ్‌ లో ముగ్గురు సుందరాంగుల కౌగిళ్ళలో నలిగి పోయిన ప్రభాస్ తో పాటే  మీరూ కూడా డాన్స్ చేస్తారేమో అనుకున్నాము అని రిపోర్టర్ అనగా, "అమ్మాయిలతో ప్రభాసే డాన్స్ చేస్తాడు. నేను పని మాత్రమే చేస్తుంటాను. నేను చాలా సిన్సియర్‌ మనిషిని" అంటూ మంచి చలోక్తి విసిరాడు. చిన్న విషయమే కాని పెదాలపై చిరునవ్వుల పూలు పూస్తాయి. కావలసింది సమయస్పూర్తి మాత్రమే. 


Image result for rana prabhas in baahubali 2



భారత పౌరాణిక ప్రతినాయక పాత్రలలో సీరియస్-నెస్ పాత్ర దుర్యొధనుడు. ఎప్పుడూ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కథానాయకులైన పంచ పాండవులను ముప్పుతిప్పలు పెట్టించే ప్రతినాయకుడాయన. రసజ్ఞత ఆ పాత్రకు సాధ్యం కాదు అనుకునే వాళ్ళం. అలాంటి పాత్రను శృంగారములో తేలియాడించారు దాన వీర శూర కర్ణలో నట సార్వభౌముడు. అలాంటి పాటను పరిచయం చెసి రామారావు శృంగార రసం వారదలా పారించి రక్తి కట్టించారు కనుబొమలను భృకుటి వద్ద కేంద్రీకరిస్తూ చలాకిగా. ఆ పాట నేర్పుతో రాశారు సినారే "చిత్రం భళారే విచిత్రం" అంటూ.


రాజమౌళి కూడా ఒక చక్కని శృంగారాన్ని ఒక పాటలోనైనా ప్రతినాయకుని శైలికి ఆపాదించాల్సింది కొంచమైనా! 
    


మరింత సమాచారం తెలుసుకోండి: