తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అప్పట్లో చిరంజీవి స్టైల్ ఫాలో అవుతున్నాడన్న రూమర్లు రావడంతో పవన్ తనదైన మానరీజంతో జనాలను ఆకర్శించడం మొదలు పెట్టాడు.  కరాటే విన్యాసాలు...సిరియస్ యాక్షన్, కామెడీ తో అభిమానులకు దగ్గరయ్యాడు.  
Image result for tholi prema posters
పవన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్దగా హిట్స్ లేక నిరాశలో ఉన్న సమయంలో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకులు కరుణాకరన్.  ఆ దెబ్బతో మనోడి పేరు  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మారు మోగిపోయింది.  ఆ సినిమా తర్వాత కరుణాకరన్ చెప్పుకోతగ్గ సినిమాలేవీ చేయకపోయినా తొలిప్రేమ పేరుతో ఇన్నాళ్లు లాగించేసాడు.  ఇక పవన్ అంటే పడిచచ్చే హీరో నితిన్ తో ‘చిన్నదాన నీ కోసం’ చిత్రం తీశాడు. ఈ చిత్రం అంచనాలన్నీ తలకిందులు చేసింది.  దీంతో ఇండస్ట్రీలో మంచి హిట్ ఇచ్చిన పవన్ ని సంప్రదించాడట కరుణాకరన్.
Image result for chinnadana neekosam
అయితే పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో తనకు మంచి హిట్ సినిమా ఇచ్చిన కరుణాకరన్ ని కాదనలేక పోయాడట పవన్.  కానీ తానొకటి తలిస్తే..దైవం ఒకటి తలచిందని కరుణాకరన్ చెప్పిన లైన్ నచ్చకపోవడంతో హ్యాండ్ ఇచ్చాడట పవన్ . ఇక యంగ్ హీరోలు సైతం చూద్దాం.. చేద్దాం అని అంటున్నారట కానీ డేట్స్ ఇవ్వడం లేదట. ఏది ఏమైనా మంచి హిట్ ఇచ్చినపుడు గొప్పగా పొగిడిన వాళ్లు తర్వాత పట్టించుకోరని ఇండస్ట్రీలో మరోసారి రుజువైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: