‘కాటమరా యుడు’ మూవీ పాటలను ఒకొక్కటిగా విడుదలచేయడం ఈమూవీ పాటల పై పెట్టుకున్న అంచనాలను తారుమారు చేస్తోంది అంటూ పవన్ అభిమానులు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఇప్పటివరకు విడుదలైన పాటలలో ఒక్క ‘మిర మీరా మీసం’ తప్ప మరి ఏపాట ట్యూన్ క్యాచీగా లేకపోవడమే అనిఅంటున్నారు. 

ఇప్పటివరకు ఈమూవీకి సంబంధించిన నాలుగు పాటలు విడుదలైనా ఒక్క టైటిల్ సాంగ్ తప్పించి మరి ఏసాంగ్ విషయంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ప్రతిభ కనిపించకపోవడంతో ఈమూవీకి అనూప్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి తప్పు చేసారు అన్న భావనలో పవన్ అభిమానులు ఉన్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీ పాటలను ఒకేసారి విడుదల చేయకుండా అంచెలంచలుగా విడుదల చేయడంవల్ల ఈమూవీ ఆడియోకి రావలసిన హైక్ ఏమాత్రం రాలేదు అన్నభావన పవన్ అభిమానులలో ప్రస్తుతం ఉంది. 

ఈమూవీ రిలీజ్‌కి అయిదారు రోజులముందు థియేట్రికల్‌ ట్రైలర్ రిలీజ్‌ చేయడంవల్ల క్రేజ్‌ బాగావుంటుందని దానివల్ల కలక్షన్స్ భారీగా వస్తాయని ఈమూవీ నిర్మాతలు ఈరోజు జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో 'కాటమరాయుడు' ట్రయిలర్‌ ను రిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఈస్ట్రాటజీ ఇంతవరకు బాగానే ఉన్నా 'బాహుబలి 2' ట్రెయిలర్‌ తర్వాత ఈట్రెయిలర్‌ వస్తోంది కాబట్టి సామాన్య ప్రేక్షకులు ఈరెండు సినిమాల ట్రైలర్స్ ను పోల్చిచూసే ప్రమాదం ఉంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ‘కాటమరాయుడు’ సగటు మాస్‌ సినిమా కనుక ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉండవు. ‘బాహుబలి’ ట్రెయిలర్‌ చూసిన మాయలో ఉన్న జనానికి  ఇప్పుడేం చూపించినా పెదవివిరిచే అవకాశాలే ఎక్కువ. దీనితో ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చినా ‘బాహుబలి 2’ ట్రైలర్ వ్యూస్ కోట్ల ముందు ఇవి ఆనవు. దీనితో ఈమూవీ ట్రెయిలర్‌ రిలీజ్‌ డిలే చేయడం మాత్రం ‘కాటమరాయుడి’ ను దెబ్బ కొట్టింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అదీకాకుండా ‘బాహుబలి 2’ ట్రైలర్ రిలీజ్ తరువాత కేవలం రెండురోజుల గ్యాప్ తో ‘కాటమరాయుడు’ ట్రైలర్ రిలీజ్ అవుతూ ఉండటంతో ఈట్రైలర్ ఎంతవరకు ఎఫెక్ట్ ను క్రియేట్ చేయగలుగుతుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ ప్రతికూలతలను అధికమిస్తూ ‘కాటమరాయుడు’ మూవీ ఈరోజు సాయంత్రం జరగబోతున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత ఈమూవీ ఎటువంటి పాజిటివ్ హైక్ ను క్రియేట్ చేసుకోగలుగుతుంది అన్నఅంశం పై ‘కాటమరాయుడు’ బ్లాక్ బస్టర్ హిట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: