నిన్నరాత్రి జరిగిన ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా కుటుంబ హీరోలు ఎవరూ రాకపోయినా పవన్ నోటి వెంట చిరంజీవి ప్రస్తావన రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తన దృష్టిలో తనకన్నా రియల్ హీరో చిరంజీవి మాత్రమే అంటూ పవన్ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. 

ఒకవైపు చిరంజీవి పవన్ ల మధ్య దూరం పెరిగి పోతోంది అని అందరూ ఊహాగానాలు చేస్తూ ఉంటే దానికి భిన్నంగా చాల వ్యూహాత్మకంగా పవన్ నోటి వెంట చిరంజీవి ప్రస్తావన రావడం నిన్నటి ఫంక్షన్ కు హైలెట్. మనిషిలోని అంతర్లీనంగా ఉండే శక్తిని తెలుసుకునే సందర్భం ప్రతీ ఒక్కరికి వస్తుందంటూ ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన పవన్ తన అలవాటుకు భిన్నంగా చాల పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు.

తన కెరియర్ తొలిరోజులలో నటించిన 'సుస్వాగతం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ కర్నూల్ లో ఒక థియేటర్ యాజమాన్యం తనను ఆసినిమా సక్సస్ మీట్ కు పిలిచినప్పుడు తాను ఆ ఫంక్షన్ కు వెళ్ళడానికి పడ్డ ఇబ్బందులను వివరిస్తూ పవన్ చిరంజీవి హీరోయిజమ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అప్పట్లో తనకు ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్ళాలన్నా తెగ ఇబ్బందిగా ఉండేదని దీనికి కారణం తన దృష్టిలో ఎప్పుడూ చిరంజీవి హీరోయిజమ్ – చిరంజీవి ఫంక్షన్స్ మాత్రమే తన మనసులో రికార్డ్ అయిన విషయాన్ని వివరించాడు పవన్. 

అంతేకాదు తన దృష్టిలో ఎప్పుడూ చిరంజీవి మాత్రమే హీరో తాను హీరోను కాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు పవన్. తన కెరియర్ తొలిరోజులలో తనను చూడటానికి విపరీతంగా వస్తున్న అభిమానులు చూసి తాను చేయి ఊపడానికి కూడ మొహమాట పడేవాడినని అంటూ అన్నయ్య చిరంజీవి చేయి ఊపితే అందంగా ఉంటుంది కాని తాను చేయి ఊపితే ఏమి బాగుంటుంది అన్న భావనలో కొంత కాలం గడిపిన రోజులను గుర్తుకు చేసుకున్నాడు పవన్. 

ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ పవర్ స్టార్ అంటూ తనను అభిమానిస్తున్న తన అభిమానులకు కృతజ్ఞతగా జీవం ఉన్నా.. జీవం లేకపోయినా ప్రతీ ఒక్కరికి.. ప్రతీ వస్తువుకూ శిరస్సు వంచి మొక్కుతున్నా అంటూ భావోద్వేగంగా పవన్ మాట్లాడినప్పుడు అభిమానుల చప్పట్లు కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లి పోయింది. ఏది ఏమైనా పవన్ నోటి వెంట చిరంజీవి ప్రస్తావన రావడం ఒక విధంగా చిరంజీవికి కూడ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: