పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన రేంజ్ ఏంటో కలక్షన్స్ సునామితో చూపించాడు. కత్తి రీమేక్ గా వచిన ఈ సినిమా తెలుగులో చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి మొత్తానికి సినిమా హిట్ కొట్టేశాడు చిరు. మొన్నటిదాకా నాన్ బాహుబలి రికార్డులన్ని కొట్టేసి టాప్ ప్లేస్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడుని దాటేసి చిరంజీవి రేసులో ముందు నిలిచాడు.


ఇక మిగులుంది బాహుబలి రికార్డులే మరి ఆ రికార్డులను కొల్లగొట్టడం ఈజీ థింగ్ ఏం కాదు. బాహుబలి మొదటి పార్ట్ రాబోతున్న సెకండ్ పార్ట్ ఈ రికార్డులను బ్రేక్ చేయాలంటే అదే రేంజ్ సినిమా కావాలి. అందుకే చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను ఎంచుకున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లబోతుందట.


సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని చూస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చే ఈ సినిమా మరో బాహుబలి లాంటి సినిమా అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. పరుచూరి బ్రదర్స్ కథ అందించిన ఈ సినిమాకు బాలీవుడ్ హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ ను తెప్పిస్తున్నారట. స్వాతంత్రానికి ముందు జరిగిన కథ కాబట్టి సినిమాను పెద్ద రేంజ్లో తెరకెక్కించాలని చూస్తున్నారట.


ఈ సినిమా కోసం మెగాస్టార్ మళ్లీ హోం వర్క్ స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో చిరు లుక్ కోసమే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. మెగా ఎంట్రీతో మరోసారి రికార్డుల మోత మోగించిన చిరంజీవి బాహుబలి రేంజ్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉండాలని చెబుతున్నాడట. మరి రాజమౌళి డైరక్టర్ కాబట్టి బాహుబలికి ఆ రేంజ్ వచ్చింది. సురేందర్ రెడ్డి కూడా సినిమాను అదే రేంజ్ కు తీసుకెళ్తాడా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: