తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన కాటమరాయుడు మూవీ ప్రి రీలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ప్రి రిలీజ్ ఫంక్షన్ చాలా వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఉద్ధేశించిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌ కి జోష్ ని ఇచ్చాయి. యువతను టార్గెట్‌గా చేసుకొని, ఆకట్టుకునేలా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ ని ఇచ్చారు.

జీవితం అనేది నిరంతర పోరాటమని, గెలుపును..ఓటమిని సమానంగా చూడాలని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరిలో శక్తి ఉందని…దాన్ని మొదటగా గుర్తించాలని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రి రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మార్కెట్ లోకి వచ్చిన కాటమరాయుడు థియోట్రికల్ ట్రైలర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే కాటమరాయుడు థియోట్రికల్ ఒక మిలియన్ మార్క్ ని చేరుకుంది.

ఈసారి తెలుగు మార్కెట్ లో కాటమరాయుడు మూవీకి భారీ క్రేజ్ ఉందని ఈ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ ని చూస్తే తెలుస్తుంది. ఇక కాటమరాయుడు థియోట్రికల్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కి విశేష ఆధరణ వస్తుంది. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ సైతం కొత్తగా ఉండటంతో తన లుక్ ఈ మూవీలో సరికొత్తగా కనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంది? అనేది పవన్ కళ్యాన్ ప్రి రిలీజ్ ఫంక్షన్ రోజే చెప్పటంతో ఫ్యాన్స్ ఈ సినిమాని చూడటానికి మరింతగా ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్ కోసమే సినిమాని చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇక యూ ట్యూబ్ లో కాటమరాయుడు థియోట్రికల్ ట్రైలర్ ఒక రోజులో 2 మిలియన్ హిట్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కాటమరాయుడు మూవీపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: