మెగాహీరో రామ్ చరణ్ ఓ మూవీ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….రామ్ చరణ్ ప్రస్తుతం నటించబోతున్న మూవీ సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు తను నిర్మాతగా మారి సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ కొట్టిన మూవీ ఖైదీ నెం150. మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’తో సత్తా చాటడమే కాకుండా, రామ్ చరణ్ కి మంచి లాభాలను కూడ తెచ్చిపెట్టాడు.

దీంతో మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్…చిరంజీవితో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి తన 151వ సినిమాని రామ్ చరణ్ బ్యానర్ లోనే చేస్తున్నారు. ఆ విధంగా వస్తున్న మూవీనే ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’. ‘కొణిదెల ప్రొడక్షన్స్‌’ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకుడు. చారిత్రక నేపథ్యమున్న ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఇప్పటికే దర్శకుడు స్ర్కిప్ట్ ఫైనల్‌ వెర్షన్‌ ని సిద్ధం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి 151వ సినిమా లుక్‌ ఇదేనంటూ ఓ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పోస్టర్ దాదాపు అఫిషియల్ పోస్టర్ లాగే ఉందని అంటున్నారు. గొడ్డలి, టైటిల్‌ లోగోతో పవర్‌ఫుల్‌గా ఉన్న ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ పోస్టర్ పై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు.

ఇది అఫిషియల్ పోస్టర్ కాదని క్లియర్ గా చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్‌ ఎక్కడనుంచి వచ్చిందనేది మాత్రం తెలియడం లేదు. రామ్ చరణ్ క్లియర్ గా చెప్పటంతో ఇక ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని చేసి ఉంటారని అంటున్నారు. అయితే ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ పోస్టర్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉందని చాలా మంది అంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ‘ఉయ్యలవాడ నర్సింహారెడ్డి’ పోస్టర్ ఇంతకు మించి ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: